News October 5, 2025
NLG: స్థానిక ఎన్నికల్లో బరిలోకి ఒంటరిగానే…!

స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నది. అధికార కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని నిర్ణయించింది. మరోవైపు పార్టీ ముఖ్య నేతలు ఈసారి ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేయాలని నిర్ణయించింది. కాగా బీఆర్ఎస్, సీపీఎంలు ఒంటరిగానే బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News March 12, 2026
నెల్లూరు: హాల్ టికెట్లకు పూజలు

నెల్లూరు జిల్లాలో ఈనెల 16వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఉత్తమ ఫలితాలు సాధించేలా అనుగ్రహించాలని కోరుతూ విద్యార్థులు జొన్నవాడ శ్రీమల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయికి పూజలు చేశారు. బుచ్చి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులు ఆలయంలో హాల్ టికెట్లకు పూజలు చేయించుకున్నారు. ఇతర ప్రాంతాల్లోనూ ఇలాగే పూజలు చేయిస్తున్నారు.
News March 12, 2026
సాఫ్ట్‌వేర్ కంపెనీలను రీప్లేస్ చేసే ‘మాక్రోహార్డ్’!

సాఫ్ట్‌వేర్ కంపెనీలు చేయగలిగే అన్ని పనులను చక్కబెట్టే AI టూల్స్‌ను సిద్ధం చేయడం కోసం మస్క్ మాక్రోహార్డ్ ప్రాజెక్టును ప్రకటించారు. టెస్లా డిజిటల్ ఆప్టిమస్, గ్రోక్ LLM టెక్‌ను వాడి వీటిని తయారు చేయనున్నట్లు చెప్పారు. చౌకగా దొరికే టెస్లా AI4 చిప్స్‌ను వాడనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే సాఫ్ట్‌వేర్ కంపెనీలను ఆంథ్రోపిక్ క్లాడ్ కోవర్క్ కుదిపేస్తున్న తరుణంలో మస్క్ ప్రకటన మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
News March 12, 2026
GNT: గ్యాస్ దొరకడం గగనమేనా?

ఉమ్మడి గుంటూరు జిల్లాలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్ర సమస్యగా మారింది. డీలర్లు స్టాక్ లేదని చెబుతుండటంతో హోటళ్లు, ఫంక్షన్ క్యాటరింగ్, కర్రీ పాయింట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది. గ్యాస్ సరఫరా అంతరాయం వల్ల వ్యాపారులు ఆందోళనలో ఉండగా, చివరకు భారం మాత్రం సామాన్యులపైనే పడుతోంది. ఈ పరిస్థితిపై మీ అభిప్రాయాన్ని COMMENT చేయండి.


