News October 5, 2025
45 రోజుల్లో చలాన్ కట్టకపోతే బండి సీజ్!

మోటారు వెహికిల్స్ రూల్స్-1989లో కేంద్రం కీలక సవరణలు ప్రతిపాదించింది. నిబంధనలపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే రవాణాశాఖ అదనపు కార్యదర్శికి పంపొచ్చని కేంద్రం పేర్కొంది.
*ఐదుకు మించి చలాన్లుంటే వాహనదారుడి లైసెన్స్ రద్దు చేసే అవకాశం
*45రోజుల్లో(ప్రస్తుతం 90 రోజులు) చలాన్ కట్టకపోతే వాహనం సీజ్
*చలాన్లు ఆలస్యం చేస్తే ఆ వాహనంపై లావాదేవీలు జరపకుండా నిబంధన
*రూల్స్ అతిక్రమిస్తే 3రోజుల్లో నోటీసులు
Similar News
News March 21, 2026
జగిత్యాల: జీవన్ రెడ్డి అలక వీడేనా?

జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసం వద్ద జరిగిన చర్చలు ఆసక్తి రేపుతున్నాయి. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ చర్చలు జరిపినప్పటికీ జీవన్ రెడ్డి అలక వీడనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఉమ్మడి KNR జిల్లా మంత్రులు బుజ్జగించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఒకవైపు అధిష్ఠానం, మరోవైపు స్థానిక నేతల చర్చలు కొనసాగుతుండడంతో జీవన్ రెడ్డి తుది నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది.
News March 21, 2026
కాఠిన్యం వెనక కన్నీటి గాథలు.. TG పోలీస్ భావోద్వేగ ట్వీట్

కరీంనగర్ 2 టౌన్ SI చంద్రశేఖర్ సూసైడ్ పట్ల TG పోలీస్ భావోద్వేగ ట్వీట్ చేసింది. ‘ఖాకీ వెనక కఠినత్వమే కాదు చట్టాన్ని కాపాడే కళ్లలో కన్నీటి గాథలూ ఉంటాయి. కర్తవ్యనిష్ఠతో కాలం విసిరే కర్కశత్వ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక.. గద్దరించే గొంతు పలకని మాటల భారంతో నిశ్శబ్దం వైపు పయనించింది’ అంటూ కవిత రూపంలో నివాళులర్పించింది. భార్య దివ్య ఇటీవల ఆత్మహత్య చేసుకోగా తట్టుకోలేక నేడు చంద్రశేఖర్ సూసైడ్ చేసుకున్నారు.
News March 21, 2026
మోదీనే అతిపెద్ద చొరబాటుదారుడు: సీఎం మమత

బెంగాల్ ఎన్నికల్లో అక్రమ వలసల అంశం బీజేపీకి ప్రచారాస్త్రంగా మారిన వేళ ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ దీనిపై కౌంటర్ ఇచ్చారు. బెంగాల్‌ను టార్గెట్ చేసేవారు నరకానికి వెళ్తారని.. ప్రధాని మోదీ, ఆయన ప్రభుత్వమే అతిపెద్ద చొరబాటుదారులని విమర్శించారు. కోల్‌కతాలోని ఈద్ ఈవెంట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఇప్పటికే SIRపైనా మమత విమర్శలు గుప్పించారు. BJP ప్రజల హక్కులను లాక్కోవాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు.


