News October 5, 2025
నులిపురుగులతో కనకాంబరం పంటకు నష్టం

నులిపురుగులు కనకాంబరం మొక్కల వేర్లలోకి రంధ్రాలు చేసుకొని వెళ్లి వేర్లపై బొడిపెలను కలగజేస్తాయి. దీని వల్ల ఆకు ముడుచుకొని ఊదారంగుకు మారి మొక్కలు గిడసబారిపోతాయి. ఫలితంగా పూల పరిమాణం, దిగుబడి తగ్గుతుంది. ఈ పురుగుల వల్ల ఎండు తెగులు సోకే ప్రమాదం ఉంది. నులిపురుగుల నివారణ కోసం ఎకరాకు 200 కిలోల వేపపిండి ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. బంతి పూలతో పంట మార్పిడి చేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
Similar News
News October 5, 2025
డార్జిలింగ్ విషాదంపై స్పందించిన రాష్ట్రపతి

<<17919840>>డార్జిలింగ్<<>>లో కొండచరియలు విరిగిపడటం వల్ల జరిగిన ప్రాణనష్టం బాధాకరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు కట్టుబడి ఉన్నామని Xలో వెల్లడించారు.
News October 5, 2025
రాముడు పుట్టక ముందే ఆయన్ని కొలిచాడు

అగస్త్యుని శిష్యుడు సుతీక్ష్ణుడు. గురుదక్షిణగా అగస్త్యుడు, సుతీక్ష్ణుడ్ని శ్రీరాముడి దర్శనం కల్పించమని ఆదేశిస్తాడు. అప్పటికి రాముడింకా జన్మించడు. అయినా సుతీక్ష్ణుడు అడవిలోకి వెళ్లి ఆయన కోసం తపస్సు చేస్తాడు. ఆహారం తీసుకోడు. నీళ్లు కూడా ముట్టడు. ఆయన శరీరం ఎముకల గూడులా మారుతుంది. చివరికి రాముడు ఆయన ఆశ్రమానికి వెళ్లి ఆలింగనం ఇస్తాడు. అందుకే అసలైన భక్తికి సుతీక్ష్ణుడు నిదర్శనం అని అంటారు. <<-se>>#Bakthi<<>>
News October 5, 2025
చేపల పెంపకం.. ‘బయో సెక్యూరిటీ’తో అదనపు లాభం

‘బయో సెక్యూరిటీ’తో చేపల పెంపకంలో అదనపు లాభాలుంటాయి. సాధారణంగా మేతకు వచ్చే పశువులు చేపల చెరువులో నీటిని తాగడానికి వస్తుంటాయి. పాములు, పక్షులు కూడా చేపలను తినడానికి వస్తుంటాయి. వీటి నుంచి చేపలకు రక్షణ కోసం బయో సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటే మంచిది. దీనికోసం చేపల చెరువు చుట్టూ గ్రీన్ క్లాత్, వల లేదా ఓ ఇనుప కంచెను ఏర్పాటు చేసుకోవాలి. ప్రకృతి విపత్తుల్లో కూడా దీని వల్ల చేపలకు తక్కువ నష్టం జరుగుతుంది.