News October 5, 2025

కట్టంగూర్: యార్డు లేక దోపిడీ.. పట్టించుకునే వారేరి?

image

కట్టంగూరు మండల కేంద్రంలో వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డు లేక రైతులు ఏటా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతంలో వరి, పత్తి పంటలను పెద్ద ఎత్తున రైతులు సాగు చేస్తున్నారు. మండలంలో 22 గ్రామపంచాయతీలకు సంబంధించిన రైతులు తమ పంట ఉత్పత్తులను విక్రయించేందుకు స్థానికంగా మార్కెట్ యార్డు లేకపోవడంతో దళారులను ఆశ్రయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. అధికారులు స్పందించి ఇక్కడ సబ్ మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేయాలని కోరారు.

Similar News

News October 5, 2025

NLG: మున్నాళ్ల ముచ్చటగానే ‘ఎగ్ బిర్యానీ’

image

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందించే ‘ఎగ్ బిర్యానీ’ మున్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. భోజనాన్ని మరింత రుచికరంగా మార్చేందుకు, వారానికి రెండుసార్లు ఎగ్ బిర్యానీ ఇస్తామని మొదట్లో అట్టహాసంగా ప్రకటించారు. జిల్లాలోని 2,093 కేంద్రాల్లో ఈ పథకం ప్రారంభమైన కొద్ది రోజులకే అటకెక్కింది. మసాలా దినుసుల కోసం ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో సరఫరా నిలిచిపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

News October 5, 2025

నల్గొండ: కోడ్ కారణంగా పోలీస్ ‘గ్రీవెన్స్ డే’ రద్దు

image

స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమలులో ఉన్నందున ప్రతి సోమవారం నిర్వహించే పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. జడ్‌పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం యథావిధిగా గ్రీవెన్స్ డే కార్యక్రమం కొనసాగుతుందని ఎస్పీ స్పష్టం చేశారు.

News October 5, 2025

NLG: ఎన్నికల ఏర్పాట్లు.. తీర్పుపై ఉత్కంఠ

image

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. రిజర్వేషన్ల అంశంపై ఈ నెల 8న హైకోర్టు వెల్లడించబోయే తీర్పు కోసం రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల పనులు ఊపందుకున్నాయి. ఈ ఎన్నికల్లో కేవలం 9 పార్టీలకే ఎన్నికల సంఘం గుర్తింపు ఇవ్వగా, వాటికి సంబంధించిన ఓటర్ల జాబితాలను ముద్రించి అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.