News October 5, 2025
NLG: ఫోన్లు ఎత్తని ఎక్సైజ్ అధికారులు!

జిల్లాలో ప్రభుత్వ శాఖల అధికారుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది ప్రజలకు జవాబుదారీగా ఉండడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్షల్లో జీతాలు తీసుకుంటూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వారికి కంప్లైంట్ ఇవ్వాలన్నా, వారి నుంచి సమాచారం తెలుసుకోవాలన్నా.. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదని ప్రజలు వాపోతున్నారు.
Similar News
News March 10, 2026
నల్గొండ: నెల రోజుల పాటు పదో తరగతి పరీక్షలు

ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు నెల రోజుల పాటు సాగనున్నాయి. మొత్తం 6 పరీక్షలే ఉన్నప్పటికీ, ప్రతి పేపర్‌కు మధ్య 4 నుంచి 6 రోజుల విరామం ఉండటంతో ఏప్రిల్ మధ్య వరకు షెడ్యూల్ ఖరారైంది. విద్యార్థులు ఒత్తిడి లేకుండా, ప్రశాంతంగా ప్రిపేర్ అయ్యేందుకు SSC బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో పరీక్షలు త్వరగా ముగిసేవి, కానీ ఈసారి ప్రతి సబ్జెక్టుకు తగినంత సమయం లభించడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News March 10, 2026
నల్గొండ: బర్డ్ ఫ్లూ భయం.. అధికారి క్లారిటీ

నల్గొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి ఆనవాళ్లు లేవని జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ రమేష్ స్పష్టం చేశారు. జిల్లాలో కోళ్లు ఆరోగ్యంగా ఉన్నాయని, ఎక్కడా చనిపోయినట్లు ఫిర్యాదులు అందలేదని ఆయన తెలిపారు. ప్రజలు బర్డ్ ఫ్లూ గురించి వస్తున్న పుకార్లను నమ్మవద్దని, భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. పౌల్ట్రీ రైతులు అప్రమత్తంగా ఉండి ఏవైనా అనుమానాలు ఉంటే అధికారులను సంప్రదించాలని సూచించారు.
News March 10, 2026
నేటి నుంచి పశువులకు గాలికుంటు నివారణ టీకాలు

పశువుల్లో గాలికుంటు వ్యాధి నివారణ కోసం జిల్లా పశువైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు టీకాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,25,869 తెల్లజాతి, 3,17,279 నల్లజాతి పశువులకు టీకాలను వేయనున్నారు. 3 నెలల వయస్సు వయస్సు నిండిన వాటికి టీకాలు వేయనున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రమేష్ తెలిపారు.


