News October 5, 2025
అల్లూరి జిల్లాలో రేపటి నుంచి మండల స్థాయి క్రీడా పోటీలు

అల్లూరి జిల్లాలోని 22 మండలాల్లో, మండల స్థాయి క్రీడా పోటీలను ఈనెల సోమవారం నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి పీ.బ్రహ్మాజీరావు తెలిపారు. మండల స్థాయిలో వాలీబాల్, కబడ్డీ, ఖో-ఖో, షెటిల్, యోగా, చెస్, అథ్లెటిక్స్ పోటీలు ఉంటాయన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు లేపు యాప్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. పోటీల నిర్వహణకు మండల స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్లను నియమించామన్నారు.
Similar News
News October 5, 2025
రాముడు పుట్టక ముందే ఆయన్ని కొలిచాడు

అగస్త్యుని శిష్యుడు సుతీక్ష్ణుడు. గురుదక్షిణగా అగస్త్యుడు, సుతీక్ష్ణుడ్ని శ్రీరాముడి దర్శనం కల్పించమని ఆదేశిస్తాడు. అప్పటికి రాముడింకా జన్మించడు. అయినా సుతీక్ష్ణుడు అడవిలోకి వెళ్లి ఆయన కోసం తపస్సు చేస్తాడు. ఆహారం తీసుకోడు. నీళ్లు కూడా ముట్టడు. ఆయన శరీరం ఎముకల గూడులా మారుతుంది. చివరికి రాముడు ఆయన ఆశ్రమానికి వెళ్లి ఆలింగనం ఇస్తాడు. అందుకే అసలైన భక్తికి సుతీక్ష్ణుడు నిదర్శనం అని అంటారు. <<-se>>#Bakthi<<>>
News October 5, 2025
చేపల పెంపకం.. ‘బయో సెక్యూరిటీ’తో అదనపు లాభం

‘బయో సెక్యూరిటీ’తో చేపల పెంపకంలో అదనపు లాభాలుంటాయి. సాధారణంగా మేతకు వచ్చే పశువులు చేపల చెరువులో నీటిని తాగడానికి వస్తుంటాయి. పాములు, పక్షులు కూడా చేపలను తినడానికి వస్తుంటాయి. వీటి నుంచి చేపలకు రక్షణ కోసం బయో సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటే మంచిది. దీనికోసం చేపల చెరువు చుట్టూ గ్రీన్ క్లాత్, వల లేదా ఓ ఇనుప కంచెను ఏర్పాటు చేసుకోవాలి. ప్రకృతి విపత్తుల్లో కూడా దీని వల్ల చేపలకు తక్కువ నష్టం జరుగుతుంది.
News October 5, 2025
ప్రమాదంలో కృష్ణాపురం రిజర్వాయర్..?

జీడీనెల్లూరు నియోజకవర్గంలోని కృష్ణాపురం రిజర్వాయర్ ప్రమాదకరంగా మారింది. ప్రధాన గేట్లు మూడు చోట్ల లీకేజీలు ఉండడంతో నీరు వృథాగా పోతోంది. ప్రధాన గేటుకు అవసరమైన జనరేటర్ కూడా పాడైంది. ఐదేళ్లుగా గేట్లు మరమ్మతులకు నోచుకోలేదు. ఐదేళ్ల క్రితం నిర్మించిన రాక్ కాంక్రీట్ దెబ్బతింది. రిజర్వాయర్‌కు మరమ్మతులు చేసి నీటి వృథాను అరికట్టాలని రైతులు కోరుకుంటున్నారు.