News October 5, 2025
TTDలో త్వరలో కీలక మార్పులు..!

TTD ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు చేపట్టిన నెల రోజులు అవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన మార్క్ స్పష్టంగా కనిపిస్తోందని అధికారులు, భక్తుల నుంచి వినిపిస్తున్న మాట. చిన్నపొరపాటు కూడా లేకుండా బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశారు. ఈక్రమంలోనే త్వరలో మరికొన్ని మార్పులకు ఆయన శ్రీకారం చుడుతున్నట్లు సమాచారం. బోర్డు మీటింగ్‌లో వీటిని వెల్లడించే అవకాశం ఉంది. తిరుమలలో ఏం మార్చాలో మీరు కామెంట్ చేయండి.
Similar News
News October 5, 2025
డార్జిలింగ్ విషాదంపై స్పందించిన రాష్ట్రపతి

<<17919840>>డార్జిలింగ్<<>>లో కొండచరియలు విరిగిపడటం వల్ల జరిగిన ప్రాణనష్టం బాధాకరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు కట్టుబడి ఉన్నామని Xలో వెల్లడించారు.
News October 5, 2025
NGKL: స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి రద్దు

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వెలువడినందున ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
News October 5, 2025
దశలవారీగా రెవెన్యూ గ్రామాల్లో రీ–సర్వే పనులు: కలెక్టర్

తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 272 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే పనులు దశల వారీగా చేపడుతున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. అందులో భాగంగా ఈనెల 3 నుంచి మరో ఐదు గ్రామాల్లో రీసర్వే పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. అందులో భాగంగా సోమవారం కోరుకొండ మండలం నర్సింహాపురం అగ్రహారం గ్రామంలో రీ సర్వే గ్రామ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో 190 గ్రామాల్లో రీసర్వే పూర్తయిందన్నారు.