News October 5, 2025
పెద్దిపాలెం హైవేపై యాక్సిడెంట్.. మహిళ మృతి

ఆనందపురం మండలం పెద్దిపాలెం జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. భోగాపురం నుంచి మధురవాడ వైపు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సన్యాసమ్మ (41) హఠాత్తుగా పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు కొమ్మాది ప్రాంతానికి చెందిన రామసూరి భార్యగా పోలీసులు గుర్తించారు. ఘటనపై ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 5, 2026
విశాఖ విచ్చేసిన మంత్రి నారా లోకేశ్

రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ గురువారం మధ్యాహ్నం విశాఖ విచ్చేశారు. విశాఖ ఎయిర్ పోర్ట్‌లో ఆయనకు నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. విశాఖ వాల్తేర్ క్లబ్‌లో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల వెంకటరమణ సోదరుని కుమారుడి వివాహ వేడుకకు హాజరుకావడానికి లోకేశ్ వచ్చారు.
News March 5, 2026
ముగ్గురు సహచరులు – ఒక్కటే లక్ష్యం: నారా లోకేశ్

2024 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీలు సాధించిన ముగ్గురు నేతల (లోకేశ్, పల్లా, గంటా శ్రీనివాసరావు) అరుదైన ఫొటోను మంత్రి నారా లోకేశ్ పంచుకున్నారు. అత్యధిక ఓట్ల మెజారిటీ పొందిన ముగ్గురు సహచరులుగా.. ఈ గెలుపు తమపై ఉన్న గురుతర బాధ్యతను గుర్తు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రతిరోజూ పూర్తి నిబద్ధతతో, వినమ్రతతో ప్రజలకు సేవ చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు.
News March 5, 2026
విశాఖలో నడిరోడ్డుపై మృతదేహం

విశాఖలో నడిరోడ్డుపై వ్యక్తి విగతజీవిగా పడిఉన్నాడు. అందరూ చూస్తున్నారే గానీ ఎవరూ పట్టించుకోవడంలేదు. గంటల తరబడి మృతదేహం అలాగే ఉన్నా సమీపంలో ట్రాఫిక్ పోలీసులు సైతం పట్టించుకోలేదు. ఇసుకతోట జంక్షన్ వెంకజిపాలెం వెళ్లే మార్గంలో ప్రధాన రహదారిపై గంటల తరబడి మృతదేహం అలానే ఉంది.


