News October 5, 2025

నవీపేట్: అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య

image

నవీపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. తడుగాం గ్రామానికి చెందిన రాజయ్య(39) అప్పుల బాధ తాళలేక సూసైడ్ చేసుకున్నాడు. ఎస్సై తిరుపతి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాజయ్య గతంలో ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు. కొన్ని రోజులు ఏం పని చేయకపోవటంతో అప్పులు పెరిగిపోయాయి. దీంతో రాత్రి ఇంట్లో దూలానికి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి తల్లి, భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.

Similar News

News March 12, 2026

NZB: డిగ్రీ విద్యార్థినులకు కలెక్టర్ పాఠాలు

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారంలో ఉన్న ప్రభుత్వ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల
డిగ్రీ విద్యార్థినులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి కొద్దిసేపు వివిధ అంశాలపై బోధించారు. గురువారం కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాగా చదువుకొని ఉన్నత విద్యను పూర్తి చేసుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సూచించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ దశలో చదువును ఆపకూడదన్నారు.

News March 12, 2026

NZB: ప్రజా ప్రతినిధుల శిక్షణ సదస్సు ప్రారంభం

image

నిజామాబాద్ నగరంలోని భూమారెడ్డి కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన నగర మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లకు, బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ల శిక్షణ శిబిరం ప్రారంభమైంది. కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. నిజామాబాద్ మేయర్ ఉమారాణి, కార్పొరేట్లరు, ఛైర్మన్లు పాల్గొన్నారు.

News March 11, 2026

నవీపేట్: పాఠాలు బోధించిన కలెక్టర్

image

నవీపేట మండలం మోకన్ పల్లిలో కొనసాగుతున్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల 10వ తరగతి క్లాస్ రూంను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సందర్శించి, విద్యార్థినులకు పాఠాలు బోధించారు. పలు ప్రశ్నలు వేస్తూ వారి బోధనా సామర్థ్యాన్ని పరిశీలించారు. చక్కగా చదువుకుని ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలన్నారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ధైర్యంగా అధికారులకు ఫిర్యాదు చేయాలని, అనారోగ్య సమస్యలు తలెత్తితే నిర్లక్ష్యం చేయవద్దన్నారు.