News October 5, 2025

దుర్గగుడి సిబ్బందికి దసరా బోనస్ దక్కేనా.?

image

ఇంద్రకీలాద్రిలో దసరా ఉత్సవాలను విజయవంతం చేయడంలో 24 గంటలు కష్టపడే దుర్గగుడి సిబ్బందికి గత 4ఏళ్లుగా బోనస్ అందకపోవడం బాధాకరం. భక్తుల సేవలో నిబద్ధతతో పనిచేస్తూ, కుటుంబాలను పక్కనపెట్టి ఉద్యోగులు అమ్మవారి పండుగను విజయవంతం చేస్తున్నారు. ఈసారైనా ప్రభుత్వం, అధికారులు తమ కష్టాన్ని గుర్తించి, దసరా బోనస్‌ను మంజూరు చేస్తారని ఉద్యోగులు ఆశిస్తున్నారు. బోనస్ మంజూరైతే ఎంతో ఉపశమనం లభిస్తుందని సిబ్బంది అంటున్నారు.

Similar News

News March 16, 2026

విస్తారంగా వర్షాలు

image

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా వానలు పడుతున్నాయి. అమీర్‌పేట, జూబ్లీహిల్స్, యూసఫ్ గూడ, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, సనత్ నగర్ తదితర ఏరియాల్లో వర్షం కురిసింది. TGలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, APలోని అల్లూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడా వానలు పడుతున్నాయి. మీ ఏరియాలో వాతావరణం ఎలా ఉంది? కామెంట్ చేయండి.

News March 16, 2026

కృష్ణా: టెన్త్ పరీక్షల కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే..!

image

పదవ తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పరీక్షలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, సందేహాలు ఉన్నా కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 9491505378, 9441665999, 7702427788, 9849501067 ఫోన్ చేసి తెలియజేయాలని DEO UV సుబ్బారావు కోరారు. 24 గంటలూ ఫోన్ కాల్స్ స్వీకరిస్తామన్నారు.