News October 5, 2025

దగ్గు మందు తాగి చిన్నారుల మృతి.. డాక్టర్ అరెస్ట్

image

మధ్యప్రదేశ్‌ చింద్వారాలో కోల్డ్రిఫ్ దగ్గు మందు తాగిన 11 మంది చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ మందు వాడాలని సూచించిన వైద్యుడు ప్రవీణ్ సోనిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే సిరప్‌ తయారు చేసిన TNలోని కాంచీపురానికి చెందిన శ్రీసన్ ఫార్మా యూనిట్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారులు వాడిన దగ్గుమందులో 48.6 శాతం డైఇథైలిన్ గ్లైకాల్ ఉందని, అది విషపూరితమని అధికారులు వెల్లడించారు.

Similar News

News October 5, 2025

సాయంత్రం ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు

image

TPCC చీఫ్ మహేశ్ కుమార్ సహా కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ ఈ సాయంత్రం ఢిల్లీకి వెళ్తున్నారు. BCలకు 42% రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలవడంతో ప్రభుత్వ వాదనలు విన్పించాలని సీనియర్ లాయర్లను వీరు కలవనున్నారు. అటు ఇప్పటికే స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో, రిజర్వేషన్లపై ప్రభుత్వ ఉద్దేశం వివరించి పోలింగ్‌కు మార్గం సుగమం అయ్యేలా చూడాలని సీఎం రేవంత్ వీరికి సూచించారు.

News October 5, 2025

‘కాంతార ఛాప్టర్-1’.. కలెక్షన్లు ఎంతంటే?

image

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార ఛాప్టర్-1’ కలెక్షన్లలో దూసుకుపోతోంది. నిన్న రూ.55 కోట్లు కలెక్ట్ చేసినట్లు సినీవర్గాలు వెల్లడించాయి. విడుదలైన మూడు రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ.170 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసినట్లు తెలిపాయి. ఇవాళ ఆదివారం కావడంతో కలెక్షన్లు మరింత భారీగా పెరిగే అవకాశముంది. రుక్మిణి వసంత్, జయరామ్ ఈ మూవీలో కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.

News October 5, 2025

మెదడు సమస్యలకు నిద్రలేమి ఓ కారణం: పరిశోధన

image

ప్రస్తుత జీవనశైలి, ఉద్యోగ సమయాల వల్ల చాలా మంది నిద్రకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కొందరైతే రోజుకు 4-5 గంటలే నిద్రపోతున్నారు. అయితే మెదడు వయసు వేగంగా పెరగడానికి నిద్రలేమితో సంబంధం ఉన్నట్లు యూకే బయోబ్యాంక్ అధ్యయనంలో తేలింది. 27,500 మందిపై చేసిన అధ్యయనంలో నిద్రలేమి వల్ల మెదళ్లు అసలు వయసు కంటే ఓ ఏడాది ముందున్నట్లు గుర్తించారు. రోజుకు 7-8 గంటలు నిద్రపోతే ఈ ప్రమాదం ఉండదని వైద్యులు సూచిస్తున్నారు.