News October 5, 2025
NLG: సీటీఎస్ మెయిన్స్ ట్రేడ్ వైజ్ టాపర్ నల్లగొండ అమ్మాయే!

నల్గొండ ఐటీఐ కళాశాల విద్యార్థిని ఆడెపు అశ్వని అరుదైన ఘనత సాధించింది. సీటీఎస్ మెయిన్స్ – 2025 పరీక్షలో ఆమె ట్రేడ్ వైజ్ టాపర్‌గా నిలిచింది. ఇటీవల కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహించిన కౌశల్ దీక్షాంత్ సమారోహ్ (నైపుణ్య స్నాతకోత్సవం)లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ఆమె అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా అశ్వనిని పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు.
Similar News
News March 15, 2026
విద్యుత్ బిల్లులపై నకిలీ మెసేజ్‌లకు మోసపోవద్దు: శివశంకర్

విద్యుత్ బిల్లుల పేరుతో వినియోగదారులకు వస్తున్న నకిలీ సందేశాలను నమ్మవద్దని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి సూచించారు. బిల్లు బకాయి ఉందని, వెంటనే చెల్లించకపోతే విద్యుత్ నిలిపివేస్తామని హెచ్చరిస్తూ కొందరికి నకిలీ మెసేజ్‌లు వస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి సందేశాలను నమ్మి ఎవరూ మోసపోవద్దని కోరారు. విద్యుత్ సేవలకు సంబంధించిన సమాచారం అధికారిక మార్గాల్లోనే అందిస్తామని చెప్పారు.
News March 15, 2026
ఇండియన్ నేవీలో అగ్నివీర్ ఉద్యోగాలు!

ఇండియన్ నేవీలో అగ్నివీర్(SSR, MR, SSR Medical) పోస్టుల భర్తీకి దరఖాస్తులు మొదలయ్యాయి. ఆసక్తి, అర్హత గల అవివాహిత పురుషులు, మహిళలు APR 6 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టులను బట్టి టెన్త్, 10+2(మ్యాథ్స్, ఫిజిక్స్) లేదా డిప్లొమా పూర్తిచేసిన వారు అర్హులు. వయసు 17.5-21 ఏళ్లు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, PFT, రాతపరీక్ష, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఫీజు: రూ.550 + GST. వెబ్‌సైట్: joinindiannavy.gov.in
News March 15, 2026
నంద్యాలలో ‘ఒక్క రూపాయికే’ భోజనం

నంద్యాలలో గోళ్ల రాజేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఒక్క రూపాయికే భోజనం కార్యక్రమాన్ని నంద్యాల బ్లడ్ సెంటర్ నిర్వాహకుడు బ్లడ్ అచ్చు అభినందించారు. ఫుడ్ పాయింట్‌ను సందర్శించిన ఆయన.. అక్కడ భోజనం చేస్తున్న వారితో మాట్లాడారు. భోజనం రుచిగా ఉందని వారు తెలిపారు. నంద్యాలకు వచ్చే ప్రజలకు కేవలం ఒక్క రూపాయికే కడుపునిండా భోజనం అందించడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయన్నారు.


