News October 5, 2025

నిర్మల్: బీజేపీ జిల్లా కార్యవర్గం ఎన్నిక

image

బీజేపీ నిర్మల్ జిల్లా కార్యవర్గ కమిటీని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్ విడుదల చేశారు. ప్రధాన కార్యదర్శులుగా కరిపే విలాస్, రవీందర్ రెడ్డి, చిన్నారెడ్డి, ఉపాధ్యక్షులుగా చందు, రాజారెడ్డి, రవీందర్, శారదా, రమేశ్, కార్యదర్శులుగా రమేశ్, శ్రీనివాస్, అర్జున్, సౌజన్య, వసంత, నర్సారెడ్డి, ట్రెజరర్ భాస్కర్, ఆఫీస్ సెక్రటరీ సాగర్, సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ రవిని ఎన్నుకున్నారు.

Similar News

News March 14, 2026

‘శల్య సారథ్యం’ అంటే?

image

ఒకరిని నమ్మి కీలక బాధ్యతలు అప్పగిస్తే ప్రత్యర్థికి మేలు చేసేలా వ్యవహరించినప్పుడు ఈ జాతీయం వాడుతుంటారు. భారతంలో పాండవులకు శల్యుడు మేనమామ. అయితే దుర్యోధనుడు కుట్రతో చేసిన సత్కారానికి మెచ్చి కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులకు సాయం చేయడానికి ఒప్పుకుంటారు. తర్వాత నిజం తెలుసుకొని ధర్మరాజు వినతితో కర్ణుడి రథసారథిగా ఉంటూ సూటిపోటి మాటలతో అతని ఏకాగ్రతను దెబ్బతీసి ఓటమికి కారణమవుతారు.
<<-se>>#EPICSAYINGS<<>>

News March 14, 2026

వనపర్తి: రైస్ మిల్లర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించాలి- ఎస్పీ

image

రైతులు కష్టపడి పండించిన ధాన్యం ప్రభుత్వం రైస్ మిల్లులకు ఉపయోగించిన తర్వాత దానిపై ఏ విధమైన అక్రమాలు, నిర్లక్ష్యం జరిగిన కఠిన చర్యలు తప్పవని జిల్లా SP సునీత రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శనివారం పోలీస్ కార్యాలయంలో అధికారులతో విచారణ సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్ పడ్డీ కేసులను వేగవంతంగా విచారించి త్వరగా పూర్తి చేయాలని సంబంధిత పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

News March 14, 2026

తండ్రి మరణించినా.. కన్నీళ్లను దిగమింగి పరీక్ష రాసిన విద్యార్థి

image

కల్లూరు మండలంలోని బత్తులపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి విద్యార్థి గండేపల్లి మణికంఠ తండ్రి కొండలరావు శనివారం ఉదయం ఖమ్మం ఆస్పత్రిలో కన్నుమూశారు. మరికొద్ది గంటల్లో పరీక్ష ఉండగా తండ్రి మరణించడంతో మణికంఠ కుప్పకూలిపోయాడు. అయినా, తండ్రి ఆశయం కోసం గుండె నిబ్బరం చేసుకుని, కన్నీళ్లను దిగమింగి పరీక్షకు హాజరయ్యాడు. బాధ్యతను గుర్తించి మణికంఠ చూపిన ధైర్యం తోటి విద్యార్థులను, స్థానికులను కలచివేసింది.