News October 5, 2025
జూబ్లీహిల్స్ బైపోల్‌లో మిగిలింది ముగ్గురే?

జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. అభ్యర్థుల జాబీతాలో నవీన్‌యాదవ్, మాజీ మేయర్ బొంతురామ్మోహన్, కార్పొరేటర్ సీఎన్ రెడ్డి పేర్లను చేర్చారు. ఇన్‌ఛార్జ్ మంత్రులు షార్ట్‌లిస్ట్‌ను ఫైనల్ చేశారు. అనంతరం స్క్రీనింగ్ కమిటీకి ఈ లిస్ట్‌ను TPCC పంపనుంది. త్వరలోనే అభ్యర్థిని హైకమాండ్ ఫైనల్ చేయనుంది. దీంతో జాబ్లీ హైడ్రామాలో కొత్త అభ్యర్థుల పేర్లతో మరో మలుపు తీసుకుంది
Similar News
News March 8, 2026
యుద్ధంలోకి వస్తామన్న UK? అవసరం లేదన్న ట్రంప్!

మిడిల్ ఈస్ట్‌కు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లను పంపాలని UK అనుకుంటున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వెల్లడించారు. ‘ఒకప్పుడు మన గొప్ప మిత్ర దేశమైన UK ఎట్టకేలకు మిడిల్ ఈస్ట్‌కు రెండు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లను పంపించాలని తీవ్రంగా ఆలోచిస్తోంది. కానీ మాకు అవి అవసరం లేదు PM స్టార్మర్. మేం ఆల్రెడీ యుద్ధం గెలిచాం. ఇప్పుడు యుద్ధంలో చేరేవారు మాకు అవసరం లేదు’ అని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పోస్ట్ చేశారు.
News March 8, 2026
వెలుగుమట్ల భూ వివాదంలో 19 కేసులు నమోదు: డీసీపీ

ఖమ్మం వెలుగుమట్ల భూ వివాదంలో ఇప్పటివరకు 19 కేసులు నమోదైనట్లు అదనపు డీసీపీ(లా అండ్ ఆర్డర్) ప్రసాద్ రావు తెలిపారు. UCCRL (ML) OPDR భూదాన్ కమిటీ సభ్యుల ముసుగులో పేద బాధితుల నుంచి రూ.3 కోట్లు వసూలు చేసి వారిని మోసం చేశారని అన్నారు. దర్యాప్తులో నకిలీ పత్రాలు, అక్రమ కేటాయింపులు గుర్తించినట్లు వెల్లడించారు. ఇప్పటికే 19 కేసుల్లో 21 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి 9మందిని అరెస్టు చేశామన్నారు.
News March 8, 2026
గో బ్యాక్ చంద్రబాబు.. హామీల అమలేది?

ఈనెల 9న CM చంద్రబాబు పర్యటన నేపథ్యంలో డోన్ నియోజకవర్గానికి ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన హామీలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. డోన్‌లో జాతీయ మైనింగ్ కళాశాల ఏర్పాటు, డోన్ నియోజకవర్గాన్ని కర్నూలులో కలపడం, జలదుర్గం గ్రామాన్ని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయడం, హంద్రీనీవా కాలువ ద్వారా చెరువులను నింపడం వంటి హామీలు గుప్పించారు. వాటిని నెరవేర్చాలని ప్రజలు కోరుతుండగా, వామపక్షాలు గో బ్యాక్ చంద్రబాబు అంటున్నాయి.


