News October 5, 2025
కృష్ణుడు నెమలి పింఛాన్ని ఎందుకు ధరించాడు?

ఆహ్లాదకర వాతావరణంలో శ్రీకృష్ణుడు వేణుగానం చేయగా, ఆ మధుర నాదానికి పరవశించి నెమళ్లు ఆయన చుట్టూ చేరాయి. కృష్ణుడు నాట్యం చేస్తుండగా అవి ఆయన అడుగుల లయను అనుసరించాయి. పురివిప్పి నృత్యం చేయడం నేర్చుకున్నాయి. అలా కృష్ణుడు వాటికి గురువయ్యాడు. నెమళ్లు గురుదక్షిణగా పింఛాన్ని సమర్పించాయి. ఆ పింఛాన్ని ధరించిన కృష్ణుడు తన రూపాన్ని మరింత శోభాయమానం చేసుకున్నాడు. <<-se>>#DharmaSandehalu<<>>
Similar News
News October 5, 2025
బిహార్ రాష్ట్రంలా మారిన ఏపీ: వైసీపీ

AP: కూటమి పాలనలో ఏపీ ఇప్పుడు బిహార్‌లా తయారైందని వైసీపీ విమర్శలు చేసింది. రాష్ట్రంలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కరవైందని విమర్శించింది. ఎమ్మెల్యేలు రౌడీల అవతారం ఎత్తి పారిశ్రామికవేత్తలకు హుకుం జారీ చేస్తున్నారని దుయ్యబట్టింది. వారికి వాటాలు ఇవ్వకపోతే కంపెనీలు నడవని పరిస్థితి నెలకొందని, దీంతో పెట్టుబడులకు ఏపీ సురక్షితం కాదని NRIలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని రాసుకొచ్చింది.
News October 5, 2025
రాజీనామాకు సిద్ధమవుతున్న దానం?

ఖైరతాబాద్ MLA పదవికి దానం నాగేందర్ రాజీనామా చేస్తారని సమాచారం. 2023లో BRS నుంచి MLAగా గెలిచి 24లో కాంగ్రెస్ టికెట్‌పై సికింద్రాబాద్ MPగా పోటీ చేశారని స్పీకర్‌కు BRS ఆధారాలు ఇచ్చింది. మరోవైపు జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్థులపై PCC షార్ట్ లిస్ట్‌లో ఆయన పేరు లేదు. దీంతో టికెట్ కన్ఫర్మ్‌కు ముందే రిజైన్ చేస్తే హైకమాండ్ పాజిటివ్‌గా ఉండొచ్చని భావిస్తున్నారు. దీనిపై Way2News ప్రశ్నకు దానం సమాధానం దాటవేశారు.
News October 5, 2025
పీరియడ్స్ రాకముందే PCOS వస్తుందా?

పీరియడ్స్ మొదలయ్యాక సాధారణంగా కనిపించే సమస్యల్లో PCOS ఒకటి. ఇది హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తుంది. అయితే రుతుక్రమం మొదలుకాకముందే కొందరు బాలికల్లో PCOS లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. త్వరగా బరువు పెరగడం, పొట్టచుట్టూ కొవ్వు పెరగడం, చర్మ సమస్యలు, అవాంఛిత రోమాలు వస్తాయంటున్నారు. వీటిని గుర్తించిన వెంటనే వైద్యుల సూచనతో పోషకాలతో కూడిన ఆహారం, యోగా, వ్యాయామం వంటివి చేయాలని సూచిస్తున్నారు.