News October 5, 2025

VJA: దారుణ హత్య.. డ్రైనేజీల్లో మహిళ శరీర భాగాలు

image

విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణ హత్య ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ సైకో థ్రిల్లర్ సినిమా తరహాలో అత్యంత దారుణంగా హత్యకు గురైంది. నగరంలోని వివిధ డ్రైనేజీల వద్దకు ఆ మహిళ శరీర భాగాలు కొట్టుకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మహిళను హతమార్చి, ముక్కలు ముక్కలుగా నరికి డ్రైనేజీల్లో కలిపారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 5, 2025

కురుపాం గురుకుల పాఠశాలకు వారం రోజులు సెలవులు: కలెక్టర్

image

కురుపాం(M) శివన్నపేట గురుకుల బాలికల పాఠశాలకు వారం రోజులపాటు సెలవులు ఇస్తున్నట్లు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదివారం తెలిపారు. రేపటి నుంచి వారం రోజులు సెలవులు ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముందస్తు జాగ్రత్తలు మెరుగైన వైద్యం కోసం జాండీస్ లక్షణాలున్న విద్యార్థినిలను KGHకు తరలించారు. ప్రతి విద్యార్థి రక్తనమునాలను సేకరించామన్నారు. కాగా పలువురు విద్యార్థులు పార్వతీపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

News October 5, 2025

HYD: జూబ్లీహిల్స్ అభ్యర్థి వేటలో బీజేపీ

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సిద్ధమైన బీజేపీ అభ్యర్థి వేటలో పడింది. ఈ క్రమంలో అభ్యర్థి ఎంపిక కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని రాష్ట్ర నాయకత్వం నియమించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సెగ్మెంట్‌లో 1.83 లక్షల ఓట్లు పోల్ కాగా.. బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి 25,866 ఓట్లకే పరిమితమయ్యారు. ప్రస్తుతం ఈ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసేందుకు పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నారు.

News October 5, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: INCలో ఆ నలుగురి పేర్లు

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిపై కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్ తయారు చేసింది. ఆశావహులందరి పేర్లు పరిశీలించిన ప్రభుత్వం షార్ట్‌లిస్టు రెడీ చేసింది. ఇందులో నవీన్ యాదవ్, సీఎన్‌రెడ్డి, బొంతురామ్మోహన్, అంజన్‌కుమార్ పేర్లు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ లిస్టును అధిష్ఠానానికి పంపితే AICC అభ్యర్థిని ఫైనల్ చేయనుంది. BJP అభ్యర్థిని ఫైనల్ చేసేందుకు స్టేట్ చీఫ్ రాంచందర్ రావు ముగ్గురికి బాధ్యతలు అప్పగించారు.