News October 5, 2025

వంటింటి చిట్కాలు

image

✍️ మటన్ మెత్తగా ఉడకాలంటే చిన్న కొబ్బరి ముక్కను పెంకుతో సహా వేయాలి. మాంసం కూరలో నీరు ఎక్కువైతే చెంచా కాన్‌ఫ్లవర్ కలిపి ఉడికిస్తే చిక్కబడి రుచిగా ఉంటుంది.
✍️ పూరీల పిండిలో 4 చెంచాల పెరుగువేసి బాగా కలిపితే పూరీలు నూనె తక్కువ పీల్చుకుంటాయి. అలాగే బంగారు రంగులో మెరుస్తూ పొంగుతాయి.
✍️ వాష్ బేసిన్‌లో రంధ్రాలు మూసుకుపోయినప్పుడు వేడి నీటిలో కాస్త ఉప్పు కలిపి పోస్తే శుభ్రమవుతుంది.
<<-se>>#VantintiChitkalu<<>>

Similar News

News March 14, 2026

6 నెలల్లో స్థానిక ఎన్నికలు: CM

image

AP: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు అప్‌డేట్ ఇచ్చారు. ఎన్నికలు ఆరు నెలల్లో జరిగే అవకాశం ఉందని, వాటికి ఇప్పటి నుంచే సిద్ధం కావాలని మంత్రులకు సూచించారు. నిన్న క్యాబినెట్ భేటీలో అజెండా అంశాలపై చర్చ అనంతరం తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో మనమే గెలిచామని, ఈసారీ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించేలా ఇన్‌ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలన్నారు.

News March 14, 2026

నేటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్

image

తెలంగాణలో నేటి నుంచి ఏప్రిల్ 13 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. 9.30AM-12.30PM వరకు 3 గంటల పాటు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. గంట ముందే సెంటర్‌కు చేరుకోవాలని, ఎగ్జామ్ ప్రారంభమైన 5 ని. తర్వాత కూడా అంటే 9.35AM వరకు లోపలికి అనుమతిస్తామని ప్రభుత్వం తెలిపింది. మొత్తం 5,28,239 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచులు, కాలిక్యులేటర్లకు పర్మిషన్ లేదు.
All The Best

News March 14, 2026

సంక్షోభం ఉన్నా పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచలేదు: BJP

image

ప్రపంచంలో ఇంధన సంక్షోభం నెలకొన్నా భారత్‌లో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగలేదని బీజేపీ ట్వీట్ చేసింది. హార్ముజ్ జలసంధి మూసివేతతో బ్యారెల్ ధర $100 దాటినా మోదీ ప్రభుత్వ ముందుచూపుతో దేశంలో రేట్లు పెరగలేదని తెలిపింది. ఇదే సమయంలో G20 దేశాల్లో 20% వరకు ఇంధన ధరలు పెరిగాయని వెల్లడించింది. దేశంలో 7-8 వారాలకు సరిపడా క్రూడాయిల్ నిల్వలు ఉన్నాయని, వివిధ దేశాల నుంచి ఆయిల్ దిగుమతి అవుతోందని వివరించింది.