News October 5, 2025
ములుగు జిల్లాలో కొనసాగుతున్న ఎల్లో అలర్ట్

ములుగు జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం 25.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సగటున ప్రతి మండలంలో 2.7 సెంటీమీటర్ల వాన పడింది. అత్యధికంగా ఏటూరునాగారం మండలంలో 10.8 సెంటీమీటర్లు, వాజేడులో 3.4, మంగపేటలో 3.0, వెంకటాపురంలో 2.5, ములుగు, వెంకటాపూర్, తాడ్వాయి మండలాల్లో 1.1 సెంటీమీటర్ చొప్పున వర్షం పడింది. వాతావరణ శాఖ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Similar News
News October 5, 2025
వరంగల్: తాత్కాలికంగా ప్రజావాణి రద్దు: కలెక్టర్

స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి ఉండదని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు పూర్తిస్థాయిలో నిమగ్నమవుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
News October 5, 2025
కురుపాం గురుకుల పాఠశాలకు వారం రోజులు సెలవులు: కలెక్టర్

కురుపాం(M) శివన్నపేట గురుకుల బాలికల పాఠశాలకు వారం రోజులపాటు సెలవులు ఇస్తున్నట్లు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదివారం తెలిపారు. రేపటి నుంచి వారం రోజులు సెలవులు ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముందస్తు జాగ్రత్తలు మెరుగైన వైద్యం కోసం జాండీస్ లక్షణాలున్న విద్యార్థినిలను KGHకు తరలించారు. ప్రతి విద్యార్థి రక్తనమునాలను సేకరించామన్నారు. కాగా పలువురు విద్యార్థులు పార్వతీపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
News October 5, 2025
HYD: జూబ్లీహిల్స్ అభ్యర్థి వేటలో బీజేపీ

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సిద్ధమైన బీజేపీ అభ్యర్థి వేటలో పడింది. ఈ క్రమంలో అభ్యర్థి ఎంపిక కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని రాష్ట్ర నాయకత్వం నియమించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సెగ్మెంట్‌లో 1.83 లక్షల ఓట్లు పోల్ కాగా.. బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి 25,866 ఓట్లకే పరిమితమయ్యారు. ప్రస్తుతం ఈ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసేందుకు పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నారు.