News October 5, 2025
జగిత్యాల: బతుకమ్మ పండగలో కత్తులతో దాడి

రాయికల్ మండలం ఒడ్డెలింగాపూర్‌లో బతుకమ్మ వేడుకల వేళ ఊహించని ఘటన చోటుచేసుకుంది. కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేసుకున్న ఘటనలో బోదాసు సతీష్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానికులు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దాడి వెనుక కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 5, 2025
కామారెడ్డి: భారీ వర్షాలు.. కలెక్టర్ ఆకస్మిక పర్యటన

కామారెడ్డిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను అప్రమత్తం చేశారు. గతంలో ముంపునకు గురైన జీఆర్ కాలనీలో ఆదివారం మున్సిపల్ కమిషనర్, ఇతర రెవెన్యూ, పోలీసు సిబ్బందితో కలిసి ఆయన పర్యటించారు. జీఆర్ కాలనీ బ్రిడ్జి వద్ద నీటి ఉద్ధృతిని ఆయన పరిశీలించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
News October 5, 2025
రాజీనామాకు సిద్ధమవుతున్న దానం?

ఖైరతాబాద్ MLA పదవికి దానం నాగేందర్ రాజీనామా చేస్తారని సమాచారం. 2023లో BRS నుంచి MLAగా గెలిచి 24లో కాంగ్రెస్ టికెట్‌పై సికింద్రాబాద్ MPగా పోటీ చేశారని స్పీకర్‌కు BRS ఆధారాలు ఇచ్చింది. మరోవైపు జూబ్లీహిల్స్ బైపోల్ అభ్యర్థులపై PCC షార్ట్ లిస్ట్‌లో ఆయన పేరు లేదు. దీంతో టికెట్ కన్ఫర్మ్‌కు ముందే రిజైన్ చేస్తే హైకమాండ్ పాజిటివ్‌గా ఉండొచ్చని భావిస్తున్నారు. దీనిపై Way2News ప్రశ్నకు దానం సమాధానం దాటవేశారు.
News October 5, 2025
పీరియడ్స్ రాకముందే PCOS వస్తుందా?

పీరియడ్స్ మొదలయ్యాక సాధారణంగా కనిపించే సమస్యల్లో PCOS ఒకటి. ఇది హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తుంది. అయితే రుతుక్రమం మొదలుకాకముందే కొందరు బాలికల్లో PCOS లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. త్వరగా బరువు పెరగడం, పొట్టచుట్టూ కొవ్వు పెరగడం, చర్మ సమస్యలు, అవాంఛిత రోమాలు వస్తాయంటున్నారు. వీటిని గుర్తించిన వెంటనే వైద్యుల సూచనతో పోషకాలతో కూడిన ఆహారం, యోగా, వ్యాయామం వంటివి చేయాలని సూచిస్తున్నారు.