News October 5, 2025

కరూర్ తొక్కిసలాట ప్లాన్డ్ ఇన్సిడెంట్: ఖుష్బూ

image

TVK చీఫ్ విజయ్ కరూర్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఇది ప్లాన్/క్రియేట్ చేసిన ప్రమాదంగా నటి, BJP నేత ఖుష్బూ ఆరోపించారు. ‘తొక్కిసలాట నిర్లక్ష్యం వల్లే జరిగిందని ప్రజలు నమ్ముతున్నారు. ఇది సృష్టించిన విపత్తులా కనిపిస్తోంది. విజయ్ కోసం ఎంతమంది జనం వస్తారో ప్రభుత్వానికి తెలిసినా ర్యాలీకి సరైన స్థలం కేటాయించలేదు. CM మౌనం వీడి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.

Similar News

News March 14, 2026

అనసూయపై అసభ్యకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్

image

TG: సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, కామెంట్స్ పెడుతున్నారా? జాగ్రత్త. నటి అనసూయపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని సైబరాబాద్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కడప(AP)కు చెందిన జనార్దన్ HYDలో ఉంటున్నాడు. అనసూయపై AI వీడియోలు రూపొందించి అసభ్యకర వ్యాఖ్యలతో పోస్ట్ చేశాడు. ఆమె కంప్లైంట్ ఇవ్వడంతో కేసు నమోదైంది. మరో కేసులో ఓ సినీ నటి రీల్‌పై అసభ్యకర కామెంట్ చేసిన ఆటో డ్రైవర్‌ను పోలీసులు జైలుకు పంపారు.

News March 14, 2026

ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ పాసుల ధర పెంపు

image

ఫాస్టాగ్ వార్షిక పాసుల ధరలను పెంచుతున్నట్లు NHAI ప్రకటించింది. ప్రస్తుతం రూ.3వేలు ఉండగా ఏప్రిల్ 1 నుంచి రూ.3,075 వసూలు చేయనున్నట్లు తెలిపింది. కార్లు, జీపులు, వ్యాన్ల లాంటి ప్రైవేట్ నాన్ కమర్షియల్ వాహనాలకు ఈ పాస్ వర్తిస్తుంది. ఏడాది కాలం లేదా 200 ట్రిప్పులకు (ఏది ముందుగా వస్తే అది) ఈ వార్షిక పాస్ వినియోగించుకోవచ్చు.

News March 14, 2026

విశాఖలో మరో IT పార్క్.. 30వేల జాబ్స్!

image

AP: విశాఖ మధురవాడ(రుషికొండ) ఐటీ హిల్స్‌లో గ్రేడ్-1 ఐటీ పార్క్ రానుంది. విశాఖ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు హిల్-3 వెనుక ప్రభుత్వం 30 ఎకరాలు కేటాయించింది. ఈ కంపెనీ 3 దశల్లో రూ.2,200కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా, దాదాపు 30,000 మందికి ఉద్యోగావకాశాలు రానున్నట్లు సమాచారం. 30లక్షల చ.అ విస్తీర్ణంలో భవనాలు నిర్మించనున్నారు. ఇక అమరావతిలో రూ.300కోట్ల పెట్టుబడితో ‘జేవియర్’ క్యాంపస్ ఏర్పాటు కానుంది.