News October 5, 2025
వారానికి మటన్ ఎంత తింటే మంచిదంటే?

మటన్‌లో శరీరానికి కావాల్సిన 9 రకాల అమైనో ఆమ్లాలు, మినరల్స్, ఐరన్ ఉంటుంది. ఇవి శరీర నిర్మాణానికి, కండరాల మరమ్మతులకు దోహదపడతాయి. అయినా అతిగా తింటే ఆరోగ్య సమస్యలొస్తాయని వైద్యులు చెబుతున్నారు. ‘సాధారణ ప్రజలు వారానికి 100 గ్రా., శారీరక శ్రమ చేసేవాళ్లు 200 గ్రా. వరకు తినొచ్చు. అతిగా తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి గుండె సమస్యలు, సరిగ్గా అరగక జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదముంది’ అని హెచ్చరిస్తున్నారు.
Similar News
News October 5, 2025
‘8’ సంఖ్యతో శ్రీకృష్ణుడి అనుబంధం

‘ఓం నమో నారాయణాయ’ అనే అష్టాక్షరీ మంత్రంలో ఉన్న ‘8’ సంఖ్య కృష్ణుడి జీవితంలో అత్యంత ప్రాధాన్యం కలిగి ఉంది. హరి 8వ అవతారంగా, దేవకీదేవికి 8వ సంతానంగా, ఆమె గర్భాన 8 మాసాలే ఉండి 8వ తిథి(అష్టమి)న కృష్ణుడు జన్మిస్తాడు. ఆయనకు 8 ధర్మపత్నులు. అప్పటివరకు అపశకునంగా భావించిన అష్టమి తిథికి ఆయన జననం గౌరవాన్ని చేకూర్చింది. 8 సంఖ్యకు ఉన్న అపవాదాన్ని తొలగించేందుకే కృష్ణుడు అష్టమిన పుట్టాడని నమ్ముతారు. <<-se>>#Sankhya<<>>
News October 5, 2025
తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధి: CBN

AP: శ్రీశైలం ఆలయాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేసేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆలయంలో వసతుల కల్పనపై Dy.CM పవన్ కళ్యాణ్, మంత్రి ఆనం రామనారాయణ, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇతర ప్రముఖ ఆలయాల్లో సౌకర్యాలను పరిశీలించి శ్రీశైలం అభివృద్ధి చేద్దామని సీఎంకు వారు సూచించినట్లు తెలుస్తోంది. ఆలయ అభివృద్ధికి భూమిని కేటాయించేలా కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
News October 5, 2025
బిహార్ రాష్ట్రంలా మారిన ఏపీ: వైసీపీ

AP: కూటమి పాలనలో ఏపీ ఇప్పుడు బిహార్‌లా తయారైందని వైసీపీ విమర్శలు చేసింది. రాష్ట్రంలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కరవైందని విమర్శించింది. ఎమ్మెల్యేలు రౌడీల అవతారం ఎత్తి పారిశ్రామికవేత్తలకు హుకుం జారీ చేస్తున్నారని దుయ్యబట్టింది. వారికి వాటాలు ఇవ్వకపోతే కంపెనీలు నడవని పరిస్థితి నెలకొందని, దీంతో పెట్టుబడులకు ఏపీ సురక్షితం కాదని NRIలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని రాసుకొచ్చింది.