News October 5, 2025
కొత్తగూడెం: ఎన్నికల కోసం కాల్ సెంటర్

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఎన్నికలకు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం 92400 21456 అనే ఫోన్ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసే జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యులు తమ సందేహాల కోసం ఈ కాల్ సెంటర్‌ను సంప్రదించాలని కోరారు. ఎన్నికల సంఘానికి సమాచారం అందించడానికి ప్రజలు ఈ నంబర్‌ను ఉపయోగించుకోవచ్చని సూచించారు.
Similar News
News October 5, 2025
NZB: ఎస్‌ఎస్‌సీ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు: డీఈఓ

పదో తరగతి విద్యార్థుల కోసం సోమవారం నుంచి ఒక గంట పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని డీఈఓ అశోక్ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు బోర్డు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేలా ప్రత్యేక తరగతులను తప్పనిసరిగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు. జడ్‌పీ, ప్రభుత్వ పాఠశాలలు, టీజీఎంఎస్, కేజీబీవీల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్‌లు, స్పెషల్ ఆఫీసర్లు అందరూ ఈ ఆదేశాలు పాటించాలన్నారు.
News October 5, 2025
‘8’ సంఖ్యతో శ్రీకృష్ణుడి అనుబంధం

‘ఓం నమో నారాయణాయ’ అనే అష్టాక్షరీ మంత్రంలో ఉన్న ‘8’ సంఖ్య కృష్ణుడి జీవితంలో అత్యంత ప్రాధాన్యం కలిగి ఉంది. హరి 8వ అవతారంగా, దేవకీదేవికి 8వ సంతానంగా, ఆమె గర్భాన 8 మాసాలే ఉండి 8వ తిథి(అష్టమి)న కృష్ణుడు జన్మిస్తాడు. ఆయనకు 8 ధర్మపత్నులు. అప్పటివరకు అపశకునంగా భావించిన అష్టమి తిథికి ఆయన జననం గౌరవాన్ని చేకూర్చింది. 8 సంఖ్యకు ఉన్న అపవాదాన్ని తొలగించేందుకే కృష్ణుడు అష్టమిన పుట్టాడని నమ్ముతారు. <<-se>>#Sankhya<<>>
News October 5, 2025
కురుపాం ఘటన.. మంత్రికి సీఎం ఫోన్

కురుపాం గురుకుల విద్యార్థినిల మృతి ఘటనపై మంత్రి సంధ్యారాణితో సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. సీఎం ఆదేశాలతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థినిలను మంత్రి సంధ్యారాణి పరామర్శించారు. రేపు కురుపాం పాఠశాలకు వెళ్లి మిగిలిన విద్యార్థినిలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు.