News October 5, 2025

అనంత ఐసీడీఎస్‌లో శిశువు మృతి.. మంత్రి సీరియస్

image

అనంత ఐసీడీఎస్ శిశు గృహంలో మగ శిశువు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి సంధ్యారాణి సీరియస్ అయ్యారు. దీనిపై అధికారులు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అయితే సిబ్బంది మధ్య వివాదాలతో చిన్నారికి పాలు పట్టకపోవడం వల్లే మృతి చెందినట్లు ఆరోపణలున్నాయి. మరో వైపు “నారా చంద్రబాబు నాయుడు పాలనలో ఆడబిడ్డలకే కాదు, నవజాత శిశువులకు రక్షణ లేకుండా పోయింది” అని వైసీపీ విమర్శించింది.

Similar News

News March 4, 2026

కడప: ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో శనగ ప్రొక్యూర్‌మెంట్ కేంద్రాలు.?

image

కడప జిల్లాలో శనగ పంట ప్రొక్యూర్‌మెంట్ బాధ్యత మార్క్ ఫెడ్ తీసుకుంది. జిల్లాలో 21 ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసింది. మార్క్ ఫెడ్ వద్ద ఉద్యోగులు లేక, డీసీఎంఎస్‌ను ఏజెన్సీగా నియమించుకుంది. డీసీఎంఎస్ వద్ద కూడా సిబ్బంది లేక, 21 ప్రొక్యూర్‌మెంట్ కేంద్రాల్లో నలుగురు DCMS ఉద్యోగులను సూపర్వైజర్లుగా పెట్టారు. 21మంది ప్రవేట్ వారిని ఇన్‌ఛార్జ్‌లుగా పెట్టారు. వీరు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి.

News March 4, 2026

సంగారెడ్డి: ‘మహిళల హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలి’

image

స్వయం సహాయక సంఘాల మహిళల కోసం ప్రత్యేక ‘హెల్త్ ప్రొఫైల్’ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. బుధవారం సచివాలయంలో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం(మార్చి 8) సందర్భంగా ఈ స్క్రీనింగ్ ప్రారంభించాలని ఆదేశించారు. టీ-డయాగ్నస్టిక్స్ ద్వారా ప్రతి మహిళకు 30 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తామని మంత్రి వెల్లడించారు.

News March 4, 2026

భైంసాలో ఎస్పీ గ్రీవెన్స్.. సత్వర పరిష్కారం

image

ఎస్పీ జానకి షర్మిల బుధవారం భైంసా క్యాంప్ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. ప్రజల నుంచి 6 ఫిర్యాదులు స్వీకరించి, తక్షణమే న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. షీ టీమ్ కౌన్సిలింగ్ ద్వారా కుటుంబ వివాదాలను అక్కడే పరిష్కరించారు. నిర్మల్ వెళ్లే దూరాభారం తప్పడంతో బాధితులు ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. పెండింగ్ ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని అధికారులకు ఆమె సూచించారు.