News October 5, 2025
RR: ‘అక్కా.. అమ్మా.. బాగున్నారా?’

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 7,94,653 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో మహిళలు 3,95,216 ఉన్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళల ఓట్లు కీలకం కానున్నాయి. దీంతో మహిళలను ప్రసన్నం చేసుకునేందుకు ఆశావాహులు ఇప్పటికే ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆత్మీయంగా అక్కా.. అమ్మా.. అమ్మమ్మా అంటూ పలకరిస్తూ మచ్చిక చేసుకునేందుకు పాట్లుపడుతున్నారు.
Similar News
News October 6, 2025
ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి: రంగారెడ్డి కలెక్టర్

రెండో సాధారణ పంచాయతీ ఎన్నికల్లో నోడల్, పోలింగ్ అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. రంగారెడ్డి కలెక్టరేట్ నుంచి జిల్లా అధికారులు, పోలీసులతో ఈరోజు ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ నుంచి ఫలితాలు ప్రకటించే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, విధులు కేటాయించిన అధికారులు పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలన్నారు.
News October 6, 2025
రంగారెడ్డి: బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో బీజేపీ అభ్యర్థుల ఎంపికపై కార్యకర్తల అభిప్రాయాలను బీజేపీ పరిగణలోకి తీసుకుంటోంది. బూత్ స్థాయి నుంచి కార్యకర్తల వరకు అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాతే అభ్యర్థికి పార్టీ తరఫున బీఫామ్ అందజేయనుంది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలోని గ్రామ, మండల స్థాయిలో బరిలో నిలవాలని భావించే ఆశావాహుల పేర్లను నమోదు చేసుకుంటోంది.
News October 6, 2025
RR: గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న రాజకీయ పార్టీలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాలో ఖరారైన రిజర్వేషన్లపై ఆయా పార్టీలు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చాయి. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసేందుకు ఆశావాహులు ఉత్సాహం చూపుతుండగా.. MPTC, ZPTC స్థానాల నుంచి పోటీ చేసే వారి పేర్లను సేకరించి పనిలో పార్టీలు నిమగ్నమయ్యాయి. కాగా, కోర్టు తీర్పు తర్వాత ముందుకెళ్లాలని పార్టీలు యోచిస్తున్నాయి.