News October 5, 2025
కాంగ్రెస్ షేక్‌పేట్ ఇన్‌ఛార్జ్‌గా అందె మోహన్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలవడం ఖాయమని షేక్‌పేట ఉపఎన్నికల ఇన్‌ఛార్జ్ అందె మోహన్ అన్నారు. ఈ ఎన్నికలో భాగంగా షేక్‌పేట కాంగ్రెస్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా అధిష్ఠానం నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తన భుజస్కందాలపై పెట్టిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News October 5, 2025
విశాఖలో స్ట్రీట్ వెండింగ్ జోన్లు ఏర్పాటయ్యే ప్రాంతాలివే(1/1)

జీవీఎంసీ పరిధిలో 649 <<17922542>>దుకాణాల ఏర్పాటుకు<<>> స్థలాలను అధికారులు గుర్తించారు. భీమిలి గంటస్థంభం-32 దుకాణాలు, తగరపువలస మీసేవా రోడ్డులో 86, ఎండాడ RRR సెంటర్-66, ఆరిలోవ శ్రీకాంత్‌నగర్‌లో 58, ఏయూ నార్త్ క్యాంపస్ మద్దిలపాలెం వద్ద 9, శివాజీ పార్క్ సర్వీస్ రోడ్డులో 13, LIC బిల్డింగ్-17, జీవీఎంసీ ఆఫీస్ నుంచి RTC కాంప్లెక్స్ రోడ్డులో 13, NAD జంక్షన్ నుంచి పాత కరాస రోడ్డులో 34 దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు.
News October 5, 2025
విశాఖలో స్ట్రీట్ వెండింగ్ జోన్లు ఏర్పాటయ్యే ప్రాంతాలివే(1/2)

మల్కాపురం గాంధీనగర్ మార్కెట్‌లో 100, 104 ఏరియాలో 60, ఊర్వశి జంక్షన్ నుంచి కంచరపాలెం మెట్టు రోడ్డులో 14, జింక్ గేటు జంక్షన్ వద్ద 29, దువ్వాడ ఫ్లైఓవర్ కింద 24, ఎన్‌ఏడీ జంక్షన్‌లో 10, బాజి జంక్షన్‌లో 5, గోశాల జంక్షన్‌లో 10, అడవివరం జంక్షన్‌లో 10, వేపగుంట జంక్షన్‌లో 15, పెందుర్తిలో 30, నరసింహనగర్‌లో 14 <<17922709>>దుకాణాలు ఏర్పాటు<<>> చేయనున్నారు.
News October 5, 2025
SRPT: రేపు ప్రజావాణి రద్దు: కలెక్టర్

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ప్రకటించారు. ప్రజలు తమ ఫిర్యాదులను సమర్పించేందుకు కలెక్టర్ కార్యాలయానికి రావద్దని ఆయన సూచించారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని ఆయన తెలిపారు.