News October 5, 2025

రేపు స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల ప్రదానోత్సవం: కలెక్టర్

image

స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల ప్రదానోత్సవం జిల్లాస్థాయి కార్యక్రమం ఈ నెల 6వ తేదీన జరుగుతుందని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదివారం తెలిపారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని చెప్పారు. జిల్లాకు 5 రాష్ట్ర స్థాయి, 48 జిల్లా స్థాయి అవార్డులు వచ్చాయన్నారు. స్వర్ణఆంధ్ర-స్వచ్ఛఆంధ్ర (SASA) పోర్టల్ (https://sasa.ap.gov.in/)లో వివరాలు ఉన్నాయన్నారు.

Similar News

News April 1, 2026

నేడు గుంటూరులో బాధ్యతలు చేపట్టనున్న నూతన కలెక్టర్

image

గుంటూరు నూతన కలెక్టర్‌గా సాయికాంత్ వర్మ బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు గుంటూరు కలెక్టర్ కార్యాలయం నుంచి విడుదల చేశారు. ప్రస్తుత కలెక్టర్‌గా ఉన్న ఏ.తమీమ్ అన్సారియాకు మంగళవారం సాయంత్రం వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నూతన కలెక్టర్ సాయికాంత్ వర్మ స్వస్థలం కర్నూలు జిల్లా. 1989లో జన్మించిన ఆయన తొలి ప్రయత్నంలోనే అత్యుత్తమ ర్యాంకు సాధించి ఐఏఎస్‌గా ఎంపిక కావడం విశేషం.

News April 1, 2026

గుంటూరు: పన్ను వసూళ్లలో GMC రికార్డ్

image

గుంటూరు నగరపాలక సంస్థ 90%కి పైగా పన్ను వసూళ్లతో రికార్డు సృష్టించింది. గతేడాది రూ.152.14 కోట్లు వసూళ్లు రాగా.. ఈ ఏడాది మాత్రం రూ.155.20 కోట్లు రాబట్టినట్లు కమిషనర్ కే.మయూర్ అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చివరిరోజు రూ.9 కోట్ల వసూళ్లతో నగరపాలక సంస్థ రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచిందన్నారు.

News April 1, 2026

గుంటూరు: నేటి నుంచి NTR వైద్య సేవలు బంద్..!

image

నేటి నుంచి జిల్లాలో NTR వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు AP స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. నెట్‌వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం రూ.3వేల కోట్ల బకాయిలున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అడిగినా స్పందన కరవైందంది. పాత బకాయిలివ్వకుండా 2017 రేట్లతోనే కొత్త హెల్త్ స్కీం తేవడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ఆసుపత్రుల మనుగడ కష్టంగా మారిందని, తమ ఆందోళనకు ప్రజలు మద్దతివ్వాలని ఆషా కోరింది.