News October 5, 2025
జీఎస్టీపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి: జేసీ

‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ అంశంపై సెలూన్స్, స్పా, ఇతర వాణిజ్య కేంద్రాల్లో సోమవారం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జేసీ అశుతోష్ శ్రీవాస్తవ సంబంధిత అధికారులను ఆదేశించారు. ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’పై జేసీ ఆదివారం అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అలాగే, 7,8 తేదీల్లో విద్యా సంస్థల్లో వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలను నిర్వహించాలని విద్యాశాఖ అధికారులకు ఆయన సూచించారు.
Similar News
News March 22, 2026
ఆన్‌లైన్‌లోనూ అర్జీల నమోదు: కలెక్టర్

గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం PGRS, రెవెన్యూ క్లీనిక్ కార్యక్రమాలు జరుగుతాయని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఒక ప్రకటనలో తెలిపారు. పీజీఆర్ఎస్‌లో సమర్పించిన అర్జీల స్థితిని 1100 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని అన్నారు. ప్రజలు తమ సమస్యలను మీకోసం వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా సమర్పించవచ్చన్నారు.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News March 22, 2026
తెనాలిలో అష్ట దిగ్గజాలకు ‘కీర్తి కిరీటం’ పురస్కారాలు

తెనాలిలోని రత్నా కళ్యాణ మండపంలో ఈ నెల 31న ‘మా-ఏపీ’ ఆధ్వర్యంలో ‘అష్ట దిగ్గజాలకు కీర్తి కిరీటం’ పేరిట ఉగాది పురస్కారాల ప్రధానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమ వివరాలను దర్శకుడు దిలీప్ రాజ వెల్లడించారు. కలెక్టర్ అన్సారియా ముఖ్య అతిథిగా విచ్చేసి SP వకుల్ జిందాల్, కత్తెర సురేశ్ కుమార్, కుర్ర శ్రీను, డాక్టర్ శారద, వజ్రాల రామలింగాచారి సహా పలువురు ప్రముఖులకు పురస్కారాలను అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
News March 22, 2026
గుంటూరులో కేజీ చికెన్ ధర ఎంతంటే!

గుంటూరులో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఇలా ఉన్నాయి. స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ. 320, విత్ స్కిన్ రూ. 300కి విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ. 960 వద్ద స్థిరంగా ఉంది. చేపలలో కొరమేను రూ. 430, రాగండి రూ. 180, బొచ్చెలు రూ. 230. చికెన్ ధరలు పెరగడంతో చేపలను కొనుగోలు చేయడానికి నాన్ వెజ్ ప్రియులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని వ్యాపారులు తెలిపారు. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి..


