News October 5, 2025
పెద్దపల్లి: పండగపూట విషాదఛాయలు..!

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా దసరా వేడుకల్లో భాగంగా కొన్ని కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. జిల్లాలో గడిచిన వారం రోజుల నుంచి GDKలో ఒకరు గుండెపోటుతో మరణించాగా.. నలుగురు రోడ్డు ప్రమాదంలో మరణించారు. మరో ఇద్దరు వేరువేరు కారణాలతో మృతిచెందారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు ఏడుగురు వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోగా ఆయా కుటుంబాల్లో పండగపూట విషాదం నెలకొంది.
Similar News
News March 20, 2026
పలమనేరు మాజీ MLA మృతి

పలమనేరు మాజీ MLA ఠాణేదార్ చిన్న (TC) రాజన్ (106) మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1967లో స్వతంత్ర పార్టీ తరఫున పలమనేరు నుంచి MLAగా విజయం సాధించారు. నిస్వార్థ స్వాతంత్ర్య సమరయోధుడిగా గుర్తింపు పొందారు. ఆస్తులు, సొంత ఇల్లు లేకుండా నిరాడంబరంగా జీవించారు. ప్రభుత్వ పెన్షన్‌తో జీవనం సాగించారు.
News March 20, 2026
ఈరోజు స్కూళ్లు యధాతథం: విశాఖ డీఈవో

రంజాన్ పండుగ సెలవులో మార్పు చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి (DEO) ప్రేమ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. క్యాలెండర్ ప్రకారం ఈరోజు ఉన్న సెలవును రద్దు చేసి, దానిని రేపటికి (శనివారం) మారుస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈరోజు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు యధాతథంగా పనిచేస్తాయని, రేపు మాత్రం సెలవు ఉంటుందని స్పష్టం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ మార్పును గమనించాలని కోరారు.
News March 20, 2026
శ్రీకాకుళం జిల్లాలో భారీ సైబర్ మోసం..!

శ్రీకాకుళం పట్టణంలోని పీ. ఎన్ కాలనీకి చెందిన విశ్రాంత జిల్లా వైద్యారోగ్య శాఖధికారి కృష్ణమోహన్ డిజిటల్ అరెస్టుకు గురయ్యరు. తన వద్ద సైబర్ నేరగాళ్లు రూ.56 లక్షలు కాజేశారని గురువారం 2-టౌన్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. తనకు హ్యూమన్ ట్రాఫికింగ్‌తో సంబంధాలు ఉన్నాయని, కేసు నమోదు అయిందని, డిజిటల్ అరెస్ట్ చేసినట్లు బెదిరించి సొమ్ము కాజేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.


