News October 5, 2025
రాష్ట్రంలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

APPSC వివిధ పోస్టులకు విడుదల చేసిన నోటిఫికేషన్లకు దరఖాస్తు చేయడానికి గడువు ముగుస్తోంది. లైబ్రేరియన్ సైన్స్‌లో JL(2), హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్(1) పోస్టులకు అప్లై చేయడానికి ఈనెల 7 ఆఖరు తేదీ. డ్రాఫ్ట్స్‌మన్ గ్రేడ్- 2(13), AEE (3), హార్టికల్చర్ ఆఫీసర్(2) పోస్టులకు OCT 8 లాస్ట్ డేట్. పోస్టును బట్టి వివిధ అర్హతలున్నాయి. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://portal-psc.ap.gov.in/
Similar News
News October 5, 2025
రిలే దీక్ష కొనసాగిస్తామన్న పీహెచ్‌సీ వైద్యులు!

AP: <<17917251>>పీహెచ్‌సీ<<>> వైద్యులతో ప్రభుత్వం చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. తమ డిమాండ్లకు పూర్తిగా అంగీకారం తెలపకపోవడంతో వైద్యులు రిలే దీక్షలు కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వం పీజీ ఇన్ సర్వీస్ 20% కోటాను ఏడాది కొనసాగించేందుకు అంగీకరించినట్లు ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. అయిదేళ్లు కొనసాగించడం కష్టమేనని పేర్కొన్నారు. దీంతో దీక్షలు కొనసాగిస్తున్నట్లు వైద్యులు చెప్పారు.
News October 5, 2025
టీమ్‌ఇండియాతో మ్యాచ్.. పాక్ టార్గెట్ ఎంతంటే?

మహిళల WCలో పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో టీమ్‌ఇండియా 247 పరుగులకు ఆలౌటైంది. భారత ఓపెనర్లు ప్రతికా(31), మంధాన(23) త్వరగానే ఔటయ్యారు. హర్లిన్(46) ఇన్నింగ్సును చక్కదిద్దే ప్రయత్నం చేసినా ఆమెకు తోడ్పాటు కరవైంది. చివర్లో రిచా(35) ఫర్వాలేదనిపించడంతో 247 పరుగులు చేసింది. పాకిస్థాన్ టార్గెట్ 248. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు?
News October 5, 2025
ఐదేళ్లలో కేజీ వెండి ధర రూ.3లక్షలు?

వెండి ధరలు కేవలం గడిచిన ఏడాదిలోనే 54% పెరిగాయి. పారిశ్రామిక రంగంలో, ముఖ్యంగా సోలార్ ప్యానల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలలో సిల్వర్‌కు డిమాండ్ పెరగడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇదిలాగే కొనసాగితే అతి త్వరలోనే కేజీ వెండి ధర రూ.2లక్షలు, ఐదేళ్లలో మూడు లక్షలకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్లు బంగారం, వెండిని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నట్లు వెల్లడించారు.