News October 5, 2025

రాష్ట్రంలో 118ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

తెలంగాణలో 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు దరఖాస్తు గడువును TG SLPRB పొడిగించింది. అభ్యర్థులు ఈనెల 11 సా. 5గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీతో పాటు LLBలేదా BL డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అప్లై చేసుకోవచ్చు. క్రిమినల్ కోర్టుల్లో కనీసం 3ఏళ్ల ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అయి ఉండాలి. వయసు 34ఏళ్లు మించరాదు. అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.tgprb.in

Similar News

News October 5, 2025

రిలే దీక్ష కొనసాగిస్తామన్న పీహెచ్‌సీ వైద్యులు!

image

AP: <<17917251>>పీహెచ్‌సీ<<>> వైద్యులతో ప్రభుత్వం చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. తమ డిమాండ్లకు పూర్తిగా అంగీకారం తెలపకపోవడంతో వైద్యులు రిలే దీక్షలు కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వం పీజీ ఇన్ సర్వీస్ 20% కోటాను ఏడాది కొనసాగించేందుకు అంగీకరించినట్లు ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. అయిదేళ్లు కొనసాగించడం కష్టమేనని పేర్కొన్నారు. దీంతో దీక్షలు కొనసాగిస్తున్నట్లు వైద్యులు చెప్పారు.

News October 5, 2025

టీమ్‌ఇండియాతో మ్యాచ్.. పాక్ టార్గెట్ ఎంతంటే?

image

మహిళల WCలో పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో టీమ్‌ఇండియా 247 పరుగులకు ఆలౌటైంది. భారత ఓపెనర్లు ప్రతికా(31), మంధాన(23) త్వరగానే ఔటయ్యారు. హర్లిన్(46) ఇన్నింగ్సును చక్కదిద్దే ప్రయత్నం చేసినా ఆమెకు తోడ్పాటు కరవైంది. చివర్లో రిచా(35) ఫర్వాలేదనిపించడంతో 247 పరుగులు చేసింది. పాకిస్థాన్ టార్గెట్ 248. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు?

News October 5, 2025

ఐదేళ్లలో కేజీ వెండి ధర రూ.3లక్షలు?

image

వెండి ధరలు కేవలం గడిచిన ఏడాదిలోనే 54% పెరిగాయి. పారిశ్రామిక రంగంలో, ముఖ్యంగా సోలార్ ప్యానల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలలో సిల్వర్‌కు డిమాండ్ పెరగడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇదిలాగే కొనసాగితే అతి త్వరలోనే కేజీ వెండి ధర రూ.2లక్షలు, ఐదేళ్లలో మూడు లక్షలకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్లు బంగారం, వెండిని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నట్లు వెల్లడించారు.