News October 5, 2025
రేషన్ కష్టాలు.. డీలర్ల భర్తీకి బ్రేక్

జిల్లాలో రేషన్ డీలర్ల పోస్టులో భర్తీకి నోచుకోవడం లేదు. దీంతో రేషన్ సరుకులు తెచ్చుకోవడా నికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. కొవ్వూరు డివిజన్లో 59, రాజమహేంద్రవరం డివిజన్లో 92 డీలర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో 5,63,094 రేషన్ కార్డులు, 871 రేషన్ షాపులున్నాయి. వీటిలో 151 చోట్ల డీలర్లు లేరు. గత సెప్టెంబర్లో సివిల్ సప్లై అధికారులు డీలర్ల భర్తీకి కసరత్తు చేసిన కోర్టు అభ్యంతరాలతో బ్రేక్ పడింది.
Similar News
News October 5, 2025
అక్టోబర్ 6న అవార్డుల ప్రదానోత్సవం

జిల్లా స్థాయి “స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా” అవార్డుల ప్రదానోత్సవాన్ని అక్టోబర్ 6న సాయంత్రం 4 గంటలకు రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ మేఘ స్వరూప్ ఆదివారం తెలిపారు. జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 3, జిల్లా స్థాయిలో 51 అవార్డులు లభించాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పక హాజరు కావాలని జేసీ ఆదేశించారు.
News October 5, 2025
దశలవారీగా రెవెన్యూ గ్రామాల్లో రీ–సర్వే పనులు: కలెక్టర్

తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 272 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే పనులు దశల వారీగా చేపడుతున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. అందులో భాగంగా ఈనెల 3 నుంచి మరో ఐదు గ్రామాల్లో రీసర్వే పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. అందులో భాగంగా సోమవారం కోరుకొండ మండలం నర్సింహాపురం అగ్రహారం గ్రామంలో రీ సర్వే గ్రామ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో 190 గ్రామాల్లో రీసర్వే పూర్తయిందన్నారు.
News October 5, 2025
సినీనటి శ్రీరెడ్డికి బొమ్మూరు పోలీసుల నోటీసు

సినీనటి శ్రీరెడ్డికి బొమ్మూరు పోలీస్స్టేషన్ ఎస్ఐ రమేశ్ శనివారం 35 బీఎన్ఎస్ బెయిల్ నోటీసును జారీ చేశారు. గత ఏడాది నవంబరు 12న టీడీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐటీ చట్టం కింద శ్రీరెడ్డిపై బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కాకినాడ వెళ్తున్న శ్రీరెడ్డికి లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ఎస్ఐ ఈ నోటీసులు అందజేశారు.