News October 5, 2025
చేపల పెంపకం.. ‘బయో సెక్యూరిటీ’తో అదనపు లాభం

‘బయో సెక్యూరిటీ’తో చేపల పెంపకంలో అదనపు లాభాలుంటాయి. సాధారణంగా మేతకు వచ్చే పశువులు చేపల చెరువులో నీటిని తాగడానికి వస్తుంటాయి. పాములు, పక్షులు కూడా చేపలను తినడానికి వస్తుంటాయి. వీటి నుంచి చేపలకు రక్షణ కోసం బయో సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటే మంచిది. దీనికోసం చేపల చెరువు చుట్టూ గ్రీన్ క్లాత్, వల లేదా ఓ ఇనుప కంచెను ఏర్పాటు చేసుకోవాలి. ప్రకృతి విపత్తుల్లో కూడా దీని వల్ల చేపలకు తక్కువ నష్టం జరుగుతుంది.
Similar News
News October 5, 2025
మహిళలకే చలి ఎక్కువ.. ఎందుకో తెలుసా?

పురుషుల కంటే మహిళలే చలి ఎక్కువగా ఉన్నట్లు భావిస్తారని పలు సైన్స్ జర్నల్స్ నివేదికలు చెబుతున్నాయి. మగవారి కంటే మహిళలు సగటున 2.5° ఎక్కువ ఉష్ణోగ్రతలో సౌకర్యవంతంగా ఉంటారట. తక్కువ మెటబాలిక్ రేటు, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ విడదల ఎక్కువ, పీరియడ్స్, అండాల విడుదల సమయాల వల్ల ఆడవారి శరీరం ఉష్ణోగ్రతలను ఉత్పత్తి చేసే సామర్థ్యం తగ్గుతుంది. నిర్దిష్ట సమయంలో శరీరం ఖర్చు చేసే మొత్తం ఎనర్జీ మెటబాలిక్ రేటు.
News October 5, 2025
రిలే దీక్ష కొనసాగిస్తామన్న పీహెచ్‌సీ వైద్యులు!

AP: <<17917251>>పీహెచ్‌సీ<<>> వైద్యులతో ప్రభుత్వం చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. తమ డిమాండ్లకు పూర్తిగా అంగీకారం తెలపకపోవడంతో వైద్యులు రిలే దీక్షలు కొనసాగిస్తామన్నారు. ప్రభుత్వం పీజీ ఇన్ సర్వీస్ 20% కోటాను ఏడాది కొనసాగించేందుకు అంగీకరించినట్లు ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. అయిదేళ్లు కొనసాగించడం కష్టమేనని పేర్కొన్నారు. దీంతో దీక్షలు కొనసాగిస్తున్నట్లు వైద్యులు చెప్పారు.
News October 5, 2025
టీమ్‌ఇండియాతో మ్యాచ్.. పాక్ టార్గెట్ ఎంతంటే?

మహిళల WCలో పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో టీమ్‌ఇండియా 247 పరుగులకు ఆలౌటైంది. భారత ఓపెనర్లు ప్రతికా(31), మంధాన(23) త్వరగానే ఔటయ్యారు. హర్లిన్(46) ఇన్నింగ్సును చక్కదిద్దే ప్రయత్నం చేసినా ఆమెకు తోడ్పాటు కరవైంది. చివర్లో రిచా(35) ఫర్వాలేదనిపించడంతో 247 పరుగులు చేసింది. పాకిస్థాన్ టార్గెట్ 248. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు?