News October 5, 2025
NGKL: స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి రద్దు

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ వెలువడినందున ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News March 20, 2026
అభివృద్ధి పనుల ప్రణాళికలు సిద్ధం చేయాలి: మంత్రులు

వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యేనాటికి భద్రాచలంలో పుష్కర ఘాట్‌తో పాటు మొదటి దశ ఆలయ అభివృద్ది పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని శుక్రవారం మంత్రులు సురేఖ, పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. భద్రాచలాన్ని తెలంగాణలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక హబ్‌గా మారుస్తామన్నారు. భద్రాచలం సమీపంలోని రామవరంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
News March 20, 2026
3 దశల్లో భద్రాచలం అభివృద్ధి పనులు: మంత్రులు

భద్రాచలం ఆలయ రూపురేఖలను మార్చేలా రూపొందించిన మాస్టర్ ప్లాన్‌పై శుక్రవారం సచివాలయంలోని మంత్రి కొండా సురేఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. 200 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని ఆగమ శాస్త్రం ప్రకారం భక్తుల మనోభావాలకు అనుగుణంగా మూడు దశల్లో ఆలయాన్ని అభివృద్ది చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
News March 20, 2026
పరింతడక గ్రామ సమీపంలో పెద్దపులి

పోలవరం జిల్లాలో పెద్దపులి సంచారం గిరిజన ప్రాంత ప్రజలను భయపెడుతున్న విషయం తెలిసిందే. అటవీశాఖ అధికారులు ఎప్పటికప్పుడు పులి కదలికలను గమనిస్తూ సమీప గ్రామ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి పెద్దపులి ఏలేశ్వరం మండలంలోని పరింతడక గ్రామ సమీపంలో ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ ప్రాంతం కాకినాడ, పోలవరం జిల్లాల బోర్డర్ కావడంతో రెండు జిల్లాల అధికారులు పులిపై నిఘా ఉంచారు.


