News October 5, 2025
కాంగ్రెస్ షేక్‌పేట్ ఇన్‌ఛార్జ్‌గా అందె మోహన్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలవడం ఖాయమని షేక్‌పేట ఉపఎన్నికల ఇన్‌ఛార్జ్ అందె మోహన్ అన్నారు. ఈ ఎన్నికలో భాగంగా షేక్‌పేట కాంగ్రెస్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా అధిష్ఠానం నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తన భుజస్కందాలపై పెట్టిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News October 5, 2025
తారాస్థాయికి జూబ్లీ ఫైట్

జూబ్లీహిల్స్‌లో ప్రచార పర్వం తారా స్థాయికి చేరింది. అభ్యర్థిని ప్రకటించిన BRS గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టింది. ఇక అధికార పార్టీ ఓ వైపు అభ్యర్థిని ఫైనల్ చేస్తూనే సెగ్మెంట్ అభివృద్ధిపై ఫుల్ ఫోకస్ చేసింది. డివిజన్లలో రూ.కోట్లు పెట్టి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తోంది. BJP కూడా ఎక్కడా తగ్గడం లేదు. గెలుపు ధీమాతో ఉంది. ఇక బైపోల్‌లో దేఖ్‌లేంగే అంటూ లోకల్ నాయకులు సవాళ్లు విసురుతున్నారు.
News October 5, 2025
నేను MLA పదవికి రాజీనామా చేయడం లేదు: దానం

తాను రాజీనామా చేస్తున్నట్లు వస్తోన్న వార్తలపై ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ స్పందించారు. కావాలనే కొందరు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. గిట్టని వాళ్లు చేస్తున్న పని ఇది అంటూ దానం స్పష్టం చేశారు. MLA పదవికి రాజీనామా చేయనని చెప్పుకొచ్చారు.
News October 5, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: INCలో ఆ నలుగురి పేర్లు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిపై కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్ తయారు చేసింది. ఆశావహులందరి పేర్లు పరిశీలించిన ప్రభుత్వం షార్ట్‌లిస్టు రెడీ చేసింది. ఇందులో నవీన్ యాదవ్, సీఎన్‌రెడ్డి, బొంతురామ్మోహన్, అంజన్‌కుమార్ పేర్లు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ లిస్టును అధిష్ఠానానికి పంపితే AICC అభ్యర్థిని ఫైనల్ చేయనుంది. BJP అభ్యర్థిని ఫైనల్ చేసేందుకు స్టేట్ చీఫ్ రాంచందర్ రావు ముగ్గురికి బాధ్యతలు అప్పగించారు.