News October 5, 2025
భారత్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన పాకిస్థాన్

మహిళల క్రికెట్ WCలో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
ఇండియా: ప్రతికా, స్మృతి మంధాన, హర్లిన్, హర్మన్(C), రోడ్రిగ్స్, దీప్తీ శర్మ, రిచా ఘోష్, స్నేహ్ రాణా, రేణుక, క్రాంతి, శ్రీ చరణి
పాక్: మునీబా, సాదక్, సిద్రా అమిన్, రమీన్, అలియా, నవాజ్, ఫాతిమా(C), నటాలియా, డయానా, నష్రా, సదియా
Similar News
News October 5, 2025
By Mistake డబ్బు పంపారా? ఈ నంబర్‌కు కాల్ చేయండి!

చాలా మంది పొరపాటున ఒకరికి బదులు మరొకరికి డబ్బులు పంపిస్తుంటారు. అలాంటి సమయంలో కంగారు పడకుండా దానిని స్క్రీన్ షాట్ తీసుకోండి. గూగుల్ పేలో పంపితే 18004190157, ఫోన్‌పే 08068727374, పేటీఎం 01204456456, BHIMలో అయితే 18001201740 నంబర్లకు ఫోన్ చేయాలి. వారికి సమస్య గురించి చెబితే డబ్బు తిరిగి అకౌంట్‌కి వచ్చేలా చర్యలు తీసుకుంటారు. లేదా <
News October 5, 2025
ఎవరెస్టుపై మంచుతుఫాను.. 1000 మంది దిగ్బంధం

ఎవరెస్టుపై మంచు తుఫాను బీభత్సం సృష్టించింది. భారీ హిమపాతం చోటు చేసుకోవడంతో టిబెట్ వైపుగా 16వేల అడుగులు ఎత్తులో 1000 మంది చిక్కుకుపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. వీరిలో కొందరు హైపోథెర్మియాతో బాధపడుతున్నట్లు వెల్లడించింది. రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొంది. స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అటు <<17921586>>నేపాల్‌లో<<>> భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.
News October 5, 2025
మహిళలకే చలి ఎక్కువ.. ఎందుకో తెలుసా?

పురుషుల కంటే మహిళలే చలి ఎక్కువగా ఉన్నట్లు భావిస్తారని పలు సైన్స్ జర్నల్స్ నివేదికలు చెబుతున్నాయి. మగవారి కంటే మహిళలు సగటున 2.5° ఎక్కువ ఉష్ణోగ్రతలో సౌకర్యవంతంగా ఉంటారట. తక్కువ మెటబాలిక్ రేటు, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ విడదల ఎక్కువ, పీరియడ్స్, అండాల విడుదల సమయాల వల్ల ఆడవారి శరీరం ఉష్ణోగ్రతలను ఉత్పత్తి చేసే సామర్థ్యం తగ్గుతుంది. నిర్దిష్ట సమయంలో శరీరం ఖర్చు చేసే మొత్తం ఎనర్జీ మెటబాలిక్ రేటు.