News October 5, 2025

మెదడు సమస్యలకు నిద్రలేమి ఓ కారణం: పరిశోధన

image

ప్రస్తుత జీవనశైలి, ఉద్యోగ సమయాల వల్ల చాలా మంది నిద్రకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కొందరైతే రోజుకు 4-5 గంటలే నిద్రపోతున్నారు. అయితే మెదడు వయసు వేగంగా పెరగడానికి నిద్రలేమితో సంబంధం ఉన్నట్లు యూకే బయోబ్యాంక్ అధ్యయనంలో తేలింది. 27,500 మందిపై చేసిన అధ్యయనంలో నిద్రలేమి వల్ల మెదళ్లు అసలు వయసు కంటే ఓ ఏడాది ముందున్నట్లు గుర్తించారు. రోజుకు 7-8 గంటలు నిద్రపోతే ఈ ప్రమాదం ఉండదని వైద్యులు సూచిస్తున్నారు.

Similar News

News October 5, 2025

By Mistake డబ్బు పంపారా? ఈ నంబర్‌కు కాల్ చేయండి!

image

చాలా మంది పొరపాటున ఒకరికి బదులు మరొకరికి డబ్బులు పంపిస్తుంటారు. అలాంటి సమయంలో కంగారు పడకుండా దానిని స్క్రీన్ షాట్ తీసుకోండి. గూగుల్ పేలో పంపితే 18004190157, ఫోన్‌పే 08068727374, పేటీఎం 01204456456, BHIMలో అయితే 18001201740 నంబర్లకు ఫోన్ చేయాలి. వారికి సమస్య గురించి చెబితే డబ్బు తిరిగి అకౌంట్‌కి వచ్చేలా చర్యలు తీసుకుంటారు. లేదా <>NPCI<<>> వెబ్‌సైట్‌లో కంప్లైంట్ ఇవ్వాలి.

News October 5, 2025

ఎవరెస్టుపై మంచుతుఫాను.. 1000 మంది దిగ్బంధం

image

ఎవరెస్టుపై మంచు తుఫాను బీభత్సం సృష్టించింది. భారీ హిమపాతం చోటు చేసుకోవడంతో టిబెట్ వైపుగా 16వేల అడుగులు ఎత్తులో 1000 మంది చిక్కుకుపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. వీరిలో కొందరు హైపోథెర్మియాతో బాధపడుతున్నట్లు వెల్లడించింది. రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొంది. స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అటు <<17921586>>నేపాల్‌లో<<>> భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.

News October 5, 2025

మహిళలకే చలి ఎక్కువ.. ఎందుకో తెలుసా?

image

పురుషుల కంటే మహిళలే చలి ఎక్కువగా ఉన్నట్లు భావిస్తారని పలు సైన్స్ జర్నల్స్ నివేదికలు చెబుతున్నాయి. మగవారి కంటే మహిళలు సగటున 2.5° ఎక్కువ ఉష్ణోగ్రతలో సౌకర్యవంతంగా ఉంటారట. తక్కువ మెటబాలిక్ రేటు, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ విడదల ఎక్కువ, పీరియడ్స్, అండాల విడుదల సమయాల వల్ల ఆడవారి శరీరం ఉష్ణోగ్రతలను ఉత్పత్తి చేసే సామర్థ్యం తగ్గుతుంది. నిర్దిష్ట సమయంలో శరీరం ఖర్చు చేసే మొత్తం ఎనర్జీ మెటబాలిక్ రేటు.