News October 5, 2025
‘కాంతార ఛాప్టర్-1’.. కలెక్షన్లు ఎంతంటే?

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార ఛాప్టర్-1’ కలెక్షన్లలో దూసుకుపోతోంది. నిన్న రూ.55 కోట్లు కలెక్ట్ చేసినట్లు సినీవర్గాలు వెల్లడించాయి. విడుదలైన మూడు రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ.170 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసినట్లు తెలిపాయి. ఇవాళ ఆదివారం కావడంతో కలెక్షన్లు మరింత భారీగా పెరిగే అవకాశముంది. రుక్మిణి వసంత్, జయరామ్ ఈ మూవీలో కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.
Similar News
News October 5, 2025
బంకుల్లో ఇవి ఫ్రీ.. లేదంటే ఫిర్యాదు చేయండి

పెట్రోల్ బంకుల్లో ఫ్రీగా వాటర్, టాయ్‌లెట్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్, టైర్లకు గాలి అందించాలి. ఫ్యూయల్‌పై డౌట్ ఉంటే కస్టమర్ కొలత, క్వాలిటీ చెక్ ఎక్విప్‌మెంట్ అడగవచ్చు. చాలాచోట్ల నీళ్లుండవు, మూత్రశాలలు దుర్గంధంతో వాడలేము. ఇక టైర్లలో ఎయిర్‌కు చిల్లర డిమాండ్ చేసే స్థాయికి చేరింది. మీరూ ఈ సమస్య ఎదుర్కొంటే ఫిర్యాదు చేయొచ్చు. BPCL-1800224344, HPCL-18002333555, IOCL-1800233355, రిలయన్స్-18008919023.
Share It
News October 5, 2025
ముంచే ముప్పు.. ముందే తెలుసుకోలేమా..?

దేశంలో కొండచరియలు విరిగిపడి ఏటా వందలాది మంది చనిపోతున్నారు. ఇవాళ నేపాల్‌లో 51 మంది, డార్జిలింగ్‌లో 18 మంది బలయ్యారు. దీంతో ల్యాండ్‌స్లైడ్స్ ముప్పును ముందే తెలుసుకోలేమా అనే చర్చ నడుస్తోంది. వెదర్ అలర్ట్స్ వ్యవస్థల్లాగే వీటిని హెచ్చరించే సిస్టమ్‌ను NDMA, GSI, NLRMS అభివృద్ధి చేశాయి. సిక్కిం, కేరళ, ఉత్తరాఖండ్‌లో ప్రస్తుతం ట్రయల్స్‌లో ఉన్న సిస్టమ్ విజయవంతమైతే ముప్పు నుంచి ప్రజల్ని తప్పించవచ్చు.
News October 5, 2025
By Mistake డబ్బు పంపారా? ఈ నంబర్‌కు కాల్ చేయండి!

చాలా మంది పొరపాటున ఒకరికి బదులు మరొకరికి డబ్బులు పంపిస్తుంటారు. అలాంటి సమయంలో కంగారు పడకుండా దానిని స్క్రీన్ షాట్ తీసుకోండి. గూగుల్ పేలో పంపితే 18004190157, ఫోన్‌పే 08068727374, పేటీఎం 01204456456, BHIMలో అయితే 18001201740 నంబర్లకు ఫోన్ చేయాలి. వారికి సమస్య గురించి చెబితే డబ్బు తిరిగి అకౌంట్‌కి వచ్చేలా చర్యలు తీసుకుంటారు. లేదా <