News October 5, 2025

రాజన్న సిరిసిల్లలో రేపు మంత్రి సీతక్క పర్యటన

image

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం మంత్రి సీతక్క పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు సీతక్క ఇక్కడకు చేరుకుంటారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు నేసిన చీరలను పరిశీలిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ పర్యటనకు జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Similar News

News March 18, 2026

రేపే జాబ్ క్యాలెండర్.. భారీగా పోస్టులు!

image

AP: నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్‌ను రాష్ట్ర ప్రభుత్వం రేపు విడుదల చేయనుంది. 10వేలకు పైగా పోస్టులతో ఈ క్యాలెండర్‌ను మంత్రి లోకేశ్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఇందులో DSC, జూనియర్ లెక్చరర్ కలిపి 3 వేల పోస్టులు, వర్సిటీల్లో 1,500 అధ్యాపక పోస్టులు, దాదాపు 600 <<19412398>>గ్రూప్-1, 2<<>> ఉద్యోగాలు, 1,000 కానిస్టేబుల్, 400 ఎక్సైజ్ కానిస్టేబుల్ జాబ్స్ ఉంటాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

News March 18, 2026

కేయూ పరీక్ష వాయిదా.. ఏప్రిల్‌ 4కు మార్పు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఎం.ఎస్సీ ఇంటిగ్రేటెడ్‌ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ పరీక్ష వాయిదా పడింది. మార్చి 18న జరగాల్సిన ఈ పరీక్షను ఏప్రిల్‌ 4కి మార్చినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య రాజేందర్ కట్ల తెలిపారు. మిగిలిన అన్ని పరీక్షలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే యథావిధిగా జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ మార్పును గమనించాలని సూచించారు.

News March 18, 2026

ఏక పంట విధానం.. అన్నదాతకు నష్టం

image

ఒకే పంటను ఏటా ఒకే భూమిలో పండించే వ్యవసాయ పద్ధతినే ‘మోనోక్రాపింగ్'(ఏకరీతి పంట) అంటారు. తెలుగు రాష్ట్రాలలో ఇది ఎక్కువగా అమల్లో ఉంది. ఈ విధానం తొలుత లాభదాయకంగా కనిపించినా క్రమంగా పంట ఉత్పాదకత తగ్గుతుంది. భూ భౌతిక లక్షణాల క్షీణత, సేంద్రియ కర్బనం తగ్గడం, భూగర్భ జలాల కాలుష్యం, నేలల స్థిరత్వం దెబ్బతిని చీడపీడల బెడద పెరుగుతుంది. అందుకే పంట మార్పిడి విధానం అనుసరించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.