News October 5, 2025
HYD: జూబ్లీహిల్స్ అభ్యర్థి వేటలో బీజేపీ

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సిద్ధమైన బీజేపీ అభ్యర్థి వేటలో పడింది. ఈ క్రమంలో అభ్యర్థి ఎంపిక కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని రాష్ట్ర నాయకత్వం నియమించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సెగ్మెంట్‌లో 1.83 లక్షల ఓట్లు పోల్ కాగా.. బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి 25,866 ఓట్లకే పరిమితమయ్యారు. ప్రస్తుతం ఈ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసేందుకు పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నారు.
Similar News
News October 5, 2025
మెదక్: మద్యం దుకాణాలకు 6 దరఖాస్తులు

జిల్లాలో మద్యం దుకాణాలకు ఆరు దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మెదక్ పరిధి పోతంశెట్టిపల్లి (15వ దుకాణం) 3 దరఖాస్తులు, పాపన్నపేట (10) ఒక దరఖాస్తు, రామాయంపేట పరిధి మాసాయిపేట (42) ఒకటి, నార్సింగి (43) ఒక దరఖాస్తురాగా మొత్తం 6 దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. ఈనెల 18 వరకు పని దినాలలో ఉ.10 గంటల నుంచి సా.5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు.
News October 5, 2025
కలెక్షన్లలో పవన్ కళ్యాణ్ ‘OG’ సెన్సేషన్

పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘OG’ థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ ఏడాది అత్యధిక గ్రాస్ వసూలు చేసిన తెలుగు చిత్రంగా నిలిచిందని మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. దీంతో ‘సంక్రాంతికి వస్తున్నాం’(రూ.300+ కోట్లు) రికార్డును బ్రేక్ చేసినట్లు అయింది. ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా ఇమ్రాన్ హష్మీ, ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషించారు.
News October 5, 2025
కాకినాడ: ప్రశాంతంగా ఏపీపీ రాత పరీక్ష

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల (ఏపీపీ) పోస్టుల నియామకానికి సంబంధించిన రాత పరీక్షలు ఆదివారం జేఎన్టీయూ కళాశాల కేంద్రంలో ప్రశాంత వాతావరణంలో జరిగాయని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. పరీక్షకు మొత్తం 272 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా, 212 మంది మాత్రమే హాజరయ్యారని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ వివరించారు.