News October 5, 2025

కురుపాం ఘటన.. మంత్రికి సీఎం ఫోన్

image

కురుపాం గురుకుల విద్యార్థినిల మృతి ఘటనపై మంత్రి సంధ్యారాణితో సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. సీఎం ఆదేశాలతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థినిలను మంత్రి సంధ్యారాణి పరామర్శించారు. రేపు కురుపాం పాఠశాలకు వెళ్లి మిగిలిన విద్యార్థినిలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

Similar News

News March 13, 2026

వంట గ్యాస్‌కు కొరత లేదు: కలెక్టర్ అనుదీప్

image

జిల్లాలో గృహావసరాల వంట గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో గ్యాస్ డీలర్లు, పౌర సరఫరాల అధికారులతో ఆయన సమీక్షించారు. కొరతపై వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని, ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. గృహ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ నిల్వలు, అధిక ధరలపై నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు.

News March 13, 2026

భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలోని ప్రాధాన్యత ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం సీతారామ ఎత్తిపోతల పథకం, మున్నేరు రిటైనింగ్ వాల్, తీగల వంతెన పనుల పురోగతిపై ఆయన సమీక్షించారు. ప్రధాన కాలువకు భూసేకరణ ముగించి, మిగిలిన అటవీ భూముల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. పనులన్నీ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

News March 13, 2026

మూసీ పరీవాహకం నివాసయోగ్యం కాదు: రేవంత్

image

TG: HYDలోని మూసీ పరీవాహక ప్రాంత ప్రజల పట్ల తాను కూడా సానుభూతితో ఉన్నానని CM రేవంత్ తెలిపారు. కానీ కింద ఉన్న నల్గొండ జిల్లా వాసుల పరిస్థితి అర్థం చేసుకోండని సూచించారు. ఎవరికో నష్టం కలిగించాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. ‘మూసీ పరీవాహకం నివాసయోగ్యమైనది కాదని WHO స్వయంగా నివేదిక ఇచ్చింది. అక్కడ నివసించే మహిళలకు ప్రెగ్నెన్సీ సమస్యలు వస్తున్నాయి. ఆ ప్రాంతాల్లో పండించే పంటలు విషపూరితమైపోయాయి’ అని తెలిపారు.