News October 5, 2025

ఘోరం.. ఈతకు వెళ్లి ఇద్దరు మృతి

image

అన్నమయ్య జిల్లాలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. సంబేపల్లి వద్ద చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఒకరు మదనపల్లె అమ్మచెరువు మిట్టకు చెందిన యువకుడుకాగా, మరొకరు సంబేపల్లెకు చెందిన బంధువుల కుమారుడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 13, 2026

ఘనంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం: జేసీ

image

శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ-PM కిసాన్ నిధులు విడుదల కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తెలిపారు. జిల్లాలోని 6 నియోజకవర్గాల పరిధిలో పెనుకొండ, అమరాపురం, బత్తలపల్లి, లేపాక్షి, బుక్కపట్నం, నల్లచెరువు కేంద్రాలలో స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరిగిందన్నారు. రైతులు ఈ నిధులను సాగు ఖర్చులకు వినియోగించుకోవాలని జేసీ తెలిపారు.

News March 13, 2026

సూర్యాపేట: టెన్త్ పరీక్షా కేంద్రాల్లో వైద్య శిబిరాలు

image

పదో తరగతి పరీక్షల దృష్ట్యా జిల్లాలోని 69 కేంద్రాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు DMHO డాక్టర్ వెంకటరమణ తెలిపారు. సూర్యాపేటలో 41, కోదాడలో 28 కేంద్రాల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా అల్పాహారం తీసుకోవాలని, ఎండల తీవ్రత దృష్ట్యా వెంట మంచి నీళ్ల బాటిల్ తెచ్చుకోవాలని సూచించారు. ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే వెంటనే సిబ్బందిని సంప్రదించాలని కోరారు.

News March 13, 2026

బ్లాక్‌లో గ్యాస్ అమ్మితే కఠిన చర్యలు: కలెక్టర్ సత్య శారద

image

జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ కొరత లేదని, ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్‌లో విక్రయిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ సత్య శారద స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా ఎనర్జీ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. నిరంతరాయంగా గ్యాస్ సరఫరాను పర్యవేక్షించాల్సిన బాధ్యత కమిటీపై ఉందన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే డీలర్ల లైసెన్సులను రద్దు చేయడంతో పాటు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.