News October 5, 2025
కామారెడ్డి: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జాగ్రత్త: హరీష్ రావు

సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన BRS కార్యకర్తలను అరెస్టు చేస్తున్న అంశాన్ని MLA హరీష్ రావు ఖండించారు. ‘సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వారిని అరెస్టు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లారా జాగ్రత్త! అంటూ ఆయన హెచ్చరించారు. కార్యకర్తలు ధైర్యంగా ముందుకు వెళ్లండి. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని వారికి భరోసా ఇచ్చారు. అధికారంలోకి రావడం ఖాయమని, కార్యకర్తలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
Similar News
News March 24, 2026
ALERT: పెట్రోల్ కొట్టిస్తున్నారా?

బంకుల్లో ఇంధనం కొట్టిస్తున్నప్పుడు చాలా మంది రీడింగ్ సున్నా ఉందో చెక్ చేస్తుంటారు. అయితే ఇంధన డెన్సిటీ చెక్ చేయడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. పెట్రోల్ డెన్సిటీ 720 – 775kg/m³, డీజిల్ 820 – 860kg/m³ మధ్య ఉండాలి. ఇది తక్కువగా ఉంటే ఇంధనంలో కల్తీ జరిగినట్లు అర్థం. ఈ ఇంధనం మైలేజీని తగ్గించడమే కాకుండా ఇంజిన్‌ను దెబ్బతీస్తుంది. అందుకే తప్పనిసరిగా ‘Density’ డిస్‌ప్లేలో చెక్ చేయండి. share it
News March 24, 2026
నిధులను డ్రా చేసుకునేలా పూర్తి స్వేచ్ఛనివ్వాలి: ADB కలెక్టర్

రైతు భరోసా నిధులను రైతులు డ్రా చేసుకునేలా పూర్తి స్వేచ్ఛనివ్వాలని కలెక్టర్ రాజర్షిషా బ్యాంక్ అధికారులకు స్పష్టం చేశారు. ఆదిలాబాద్ కలెక్టరేట్లో లీడ్ బ్యాంక్ కార్యాలయం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి జిల్లా సంప్రదింపుల కమిటీ (DCC), జిల్లా స్థాయి సమీక్షా కమిటీ (DLRC) సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షత నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి నిధుల పంపిణీలో బ్యాంకర్లు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
News March 24, 2026
పార్లమెంటులో ప్రశ్నించిన ఎంపీ కావ్య

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో వరంగల్‌కు జరుగుతున్న అన్యాయం పట్ల పార్లమెంట్లో ఎంపీ కడియం కావ్య ప్రశ్నించారు. 2025లో తీసుకొచ్చిన “వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్(గ్రామీణ)” చట్టం కింద 125 రోజుల ఉపాధి హామీ అమలు ఇంకా ప్రారంభం కాలేదని, వెంటనే ఈ హామీని అమలు చేయాలని, తెలంగాణలో పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించాలని అన్నారు.


