News October 5, 2025

ఇతిహాసాలు క్విజ్ – 26 సమాధానాలు

image

1. రాముడు సూర్య వంశానికి చెందినవాడు.
2. ఉత్తర, అభిమన్యుల కుమారుడు ‘పరీక్షిత్తు’.
3. విష్ణువు కాపలాదారులు జయవిజయులు.
4. కార్తికేయ స్వామికి 6 తలలుంటాయి.
5. హనుమాన్ చాలీసాను తులసీదాస్ రచించారు.
<<-se>>#IthihasaluQuiz<<>>

Similar News

News October 6, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* AP: కురుపాం గురుకుల విద్యార్థుల పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఆరా
* ప్రతి 3 బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యం: జగన్
* రేపు బీసీ రిజర్వేషన్లపై SCలో విచారణ.. ఢిల్లీకి కాంగ్రెస్ మంత్రులు
* వరద బాధితులను ఆదుకోలేని నువ్వేం సీఎంవి: హరీశ్ రావు
* తెలంగాణలో కోల్డ్రిఫ్ సిరప్‌పై నిషేధం
* నవంబర్ 22లోగా బిహార్ ఎన్నికలు పూర్తి.. EVMలపై అభ్యర్థుల కలర్ ఫొటోలు: ఈసీ
* WWCలో పాకిస్థాన్‌పై టీమ్ ఇండియా విజయం

News October 6, 2025

రేపు ‘స్వచ్ఛాంధ్ర అవార్డుల’ కార్యక్రమం

image

AP: సీఎం చంద్రబాబు రేపు విజయవాడలో స్వచ్ఛాంధ్ర అవార్డులు ప్రదానం చేయనున్నారు. మొత్తం 21 కేటగిరీలలో ఈ పురస్కారాలు అందిస్తుండగా, రాష్ట్ర స్థాయిలో 69 అవార్డులను CM చేతులమీదుగా అందజేయనున్నారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 6 మున్సిపాలిటీలు, 6 GPలకు చంద్రబాబు పురస్కారాలు ఇవ్వనున్నారు. పారిశుద్ధ్య కార్మికులు, స్వయం సహాయక సంఘాలను సత్కరించనున్నారు. జిల్లా స్థాయిలో 1,257 అవార్డులు అందజేయనున్నారు.

News October 6, 2025

మస్క్ ట్వీట్! NETFLIXకు ₹2 లక్షల కోట్ల నష్టం

image

ఎలాన్ మస్క్ చేసిన Cancel Netflix for the health of your kids ట్వీట్‌తో నెట్‌ఫ్లిక్స్ ₹2 లక్షల కోట్లు నష్టపోయింది. USA స్టాక్ మార్కెట్లో సంస్థ విలువ 5 రోజుల్లో $514Bn నుంచి $489Bnకి పడిపోయింది. ఆ సంస్థ 2023లో ఆపేసిన వివాదాస్పద యానిమేటెడ్ సిరీస్ Dead End: Paranormal Park క్లిప్స్ కొన్ని ఇటీవల వైరలయ్యాయి. దీంతో టీనేజర్‌ను ట్రాన్స్‌జెండర్‌గా చూపే కంటెంట్‌తో పిల్లలు తప్పుదోవ పడతారని మస్క్ మండిపడ్డారు.