News October 5, 2025

118 APP పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు

image

TG: 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(APP) పోస్టులకు <>దరఖాస్తు<<>> గడువును TSLPRB పొడిగించింది. ఇవాళ్టితో గడువు ముగియనుండగా ఈ నెల 11 సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్లను స్వీకరించనున్నట్లు పేర్కొంది. ఈ పోస్టులకు 7,183 మంది రిజిస్టర్ చేసుకోగా ఇవాళ మధ్యాహ్నం వరకు 2,193 అప్లై చేసుకున్నట్లు తెలిపింది. వరుస సెలవుల కారణంగా గడువు పొడిగిస్తూ TSLPRB ప్రకటన విడుదల చేసింది.

Similar News

News October 6, 2025

శుభ సమయం (06-10-2025) సోమవారం

image

✒ తిథి: శుక్ల చతుర్దశి ఉ.11.24 వరకు
✒ నక్షత్రం: పూర్వాభాద్ర ఉ.6.02 వరకు
✒ శుభ సమయం: లేవు
✒ రాహుకాలం: ఉ.7.30-ఉ.9.00
✒ యమగండం: ఉ.10.30-మ.12.00
✒ దుర్ముహూర్తం: మ.12.24-మ.1.12, మ.2.46-మ.3.34
✒ వర్జ్యం: మ.3.15-సా.4.46
✒ అమృత ఘడియలు: రా.12.36-రా.2.08

News October 6, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* AP: కురుపాం గురుకుల విద్యార్థుల పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఆరా
* ప్రతి 3 బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యం: జగన్
* రేపు బీసీ రిజర్వేషన్లపై SCలో విచారణ.. ఢిల్లీకి కాంగ్రెస్ మంత్రులు
* వరద బాధితులను ఆదుకోలేని నువ్వేం సీఎంవి: హరీశ్ రావు
* తెలంగాణలో కోల్డ్రిఫ్ సిరప్‌పై నిషేధం
* నవంబర్ 22లోగా బిహార్ ఎన్నికలు పూర్తి.. EVMలపై అభ్యర్థుల కలర్ ఫొటోలు: ఈసీ
* WWCలో పాకిస్థాన్‌పై టీమ్ ఇండియా విజయం

News October 6, 2025

రేపు ‘స్వచ్ఛాంధ్ర అవార్డుల’ కార్యక్రమం

image

AP: సీఎం చంద్రబాబు రేపు విజయవాడలో స్వచ్ఛాంధ్ర అవార్డులు ప్రదానం చేయనున్నారు. మొత్తం 21 కేటగిరీలలో ఈ పురస్కారాలు అందిస్తుండగా, రాష్ట్ర స్థాయిలో 69 అవార్డులను CM చేతులమీదుగా అందజేయనున్నారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 6 మున్సిపాలిటీలు, 6 GPలకు చంద్రబాబు పురస్కారాలు ఇవ్వనున్నారు. పారిశుద్ధ్య కార్మికులు, స్వయం సహాయక సంఘాలను సత్కరించనున్నారు. జిల్లా స్థాయిలో 1,257 అవార్డులు అందజేయనున్నారు.