News October 5, 2025

నల్గొండ: కాలువలో జారిపడి మహిళ మృతి

image

నల్గొండ మండలం కొత్తపల్లిలోని డీ-37 కాలువలో జారిపడి మహిళ మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. అదే సమయానికి అటుగా వెళుతున్న గ్రామస్థులు పెరిక రాము, పాలడుగు నాగార్జున ఆమెను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దురదృష్టవశాత్తు ఆమె అప్పటికే మృతి చెందింది. మృతురాలి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 5, 2025

NLG: మున్నాళ్ల ముచ్చటగానే ‘ఎగ్ బిర్యానీ’

image

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందించే ‘ఎగ్ బిర్యానీ’ మున్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. భోజనాన్ని మరింత రుచికరంగా మార్చేందుకు, వారానికి రెండుసార్లు ఎగ్ బిర్యానీ ఇస్తామని మొదట్లో అట్టహాసంగా ప్రకటించారు. జిల్లాలోని 2,093 కేంద్రాల్లో ఈ పథకం ప్రారంభమైన కొద్ది రోజులకే అటకెక్కింది. మసాలా దినుసుల కోసం ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో సరఫరా నిలిచిపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

News October 5, 2025

నల్గొండ: కోడ్ కారణంగా పోలీస్ ‘గ్రీవెన్స్ డే’ రద్దు

image

స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) అమలులో ఉన్నందున ప్రతి సోమవారం నిర్వహించే పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు. జడ్‌పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం యథావిధిగా గ్రీవెన్స్ డే కార్యక్రమం కొనసాగుతుందని ఎస్పీ స్పష్టం చేశారు.

News October 5, 2025

NLG: ఎన్నికల ఏర్పాట్లు.. తీర్పుపై ఉత్కంఠ

image

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. రిజర్వేషన్ల అంశంపై ఈ నెల 8న హైకోర్టు వెల్లడించబోయే తీర్పు కోసం రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల పనులు ఊపందుకున్నాయి. ఈ ఎన్నికల్లో కేవలం 9 పార్టీలకే ఎన్నికల సంఘం గుర్తింపు ఇవ్వగా, వాటికి సంబంధించిన ఓటర్ల జాబితాలను ముద్రించి అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.