News October 5, 2025

SRPT: రేపు ప్రజావాణి రద్దు: కలెక్టర్

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ప్రకటించారు. ప్రజలు తమ ఫిర్యాదులను సమర్పించేందుకు కలెక్టర్ కార్యాలయానికి రావద్దని ఆయన సూచించారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని ఆయన తెలిపారు.

Similar News

News October 6, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 06, సోమవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.55 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.07 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.22 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.01 గంటలకు
✒ ఇష: రాత్రి 7.13 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 6, 2025

నకిలీ మద్యంపై ఉక్కుపాదం: CM చంద్రబాబు

image

AP: రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజల ప్రాణాలకు చేటు చేసే నకిలీ మద్యంపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో నకిలీ మద్యం వ్యవహారంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని సూచించారు. కాగా నిందితులు జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడును టీడీపీ సస్పెండ్ చేసింది.

News October 6, 2025

జిల్లా ఎస్పీ ఆదేశాలతో విజిబుల్ పోలీసింగ్

image

కడప జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆదివారం జిల్లా ఎస్పీ ఆదేశాలతో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ప్రజల భద్రత కోసం వాహనాల తనిఖీలు, సైబర్ నేరాలపై అవగాహన, రహదారి భద్రత నిబంధనల అమలు చేశారు. డ్రంకెన్ డ్రైవ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఏవైనా భద్రత సమస్యలు ఎదుర్కొంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.