News October 5, 2025
విశాఖలో స్ట్రీట్ వెండింగ్ జోన్లు ఏర్పాటయ్యే ప్రాంతాలివే(1/2)

మల్కాపురం గాంధీనగర్ మార్కెట్‌లో 100, 104 ఏరియాలో 60, ఊర్వశి జంక్షన్ నుంచి కంచరపాలెం మెట్టు రోడ్డులో 14, జింక్ గేటు జంక్షన్ వద్ద 29, దువ్వాడ ఫ్లైఓవర్ కింద 24, ఎన్‌ఏడీ జంక్షన్‌లో 10, బాజి జంక్షన్‌లో 5, గోశాల జంక్షన్‌లో 10, అడవివరం జంక్షన్‌లో 10, వేపగుంట జంక్షన్‌లో 15, పెందుర్తిలో 30, నరసింహనగర్‌లో 14 <<17922709>>దుకాణాలు ఏర్పాటు<<>> చేయనున్నారు.
Similar News
News March 20, 2026
23న విశాఖ రానున్న సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు ఈనెల 23న విశాఖ రానున్నారు. 23న మధ్యాహ్నం విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని అక్కడి నుంచి నక్కపల్లి మండలం చందనాడ గ్రామానికి వెళ్తారు. చందనాడలో జరిగే స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అనంతరం విశాఖ నుంచి విజయవాడ బయలుదేరి వెళ్తారు. సీఎం పర్యటనకు తగ్గట్టు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
News March 20, 2026
విశాఖ: 26న పనికిరాని పాత 104 వాహనాల వేలం

విశాఖ జిల్లాకు సంబంధించిన పనిచేయని 104 సేవల పనికిరాని పాత వాహనాలను ఈ-వేలం వేయనున్నట్టు DMHO జగదీశ్వర రావు శుక్రవారం తెలిపారు. మొత్తం 20 పనికిరాని వాహనాలను మార్చి 26న ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ఆన్‌లైన్ ద్వారా ఈ-వేలం వేయనున్నట్టు చెప్పారు. వేలం నియమనిబందనలు https://konugolu.ap.gov.in పోర్టల్‌లో పొందుపరిచారు. పూర్తి వివరాలకు పోర్టల్‌లో చెక్ చేయాలన్నారు.
News March 20, 2026
నక్కపల్లిలో దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్: గణబాబు

ఉమ్మడి విశాఖ జిల్లా పరిధి నక్కపల్లిలో రూ.1.35 లక్షల కోట్లతో ఆర్సెలర్ మిట్టల్ – నిప్పన్ స్టీల్ ప్లాంట్‌కు మార్చి 23న సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. దీనివల్ల దాదాపు 55,000 మందికి ఉపాధి లభిస్తుందని విప్ గణబాబు వెల్లడించారు. 2029 నాటికి ఉత్పత్తి లక్ష్యంగా, 17.8 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఈ భారీ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. దీంతో ఉత్తరాంధ్ర పారిశ్రామిక హబ్‌గా మారనుందని ఆయన తెలిపారు.


