News October 5, 2025

విశాఖలో స్ట్రీట్ వెండింగ్ జోన్లు ఏర్పాటయ్యే ప్రాంతాలివే(1/1)

image

జీవీఎంసీ పరిధిలో 649 <<17922542>>దుకాణాల ఏర్పాటుకు<<>> స్థలాలను అధికారులు గుర్తించారు. భీమిలి గంటస్థంభం-32 దుకాణాలు, తగరపువలస మీసేవా రోడ్డులో 86, ఎండాడ RRR సెంటర్‌-66, ఆరిలోవ శ్రీకాంత్‌నగర్‌లో 58, ఏయూ నార్త్‌ క్యాంపస్‌ మద్దిలపాలెం వద్ద 9, శివాజీ పార్క్‌ సర్వీస్‌ రోడ్డులో 13, LIC బిల్డింగ్‌-17, జీవీఎంసీ ఆఫీస్ నుంచి RTC కాంప్లెక్స్‌ రోడ్డులో 13, NAD జంక్షన్‌ నుంచి పాత కరాస రోడ్డులో 34 దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు.

Similar News

News October 6, 2025

విశాఖ: ఏ జోన్‌లో ఎంతమంది వర్తకులున్నారంటే?

image

ఇటీవల యూసీడీ (UCD) విభాగం ఆధ్వర్యంలో జీవీఎంసీలోని వీధి వర్తకుల సర్వే పూర్తయింది. ఎనిమిది జోన్‌ల పరిధిలో 18,041 మంది వ్యాపారులను గుర్తించారు. జోన్‌-1 పరిధిలో 217 మంది, జోన్‌-2లో 2,965, జోన్‌-3లో 3,615, జోన్‌-4లో 2,879, జోన్‌-5లో 3,510, జోన్‌-6లో 2,152, జోన్‌-7లో 154, జోన్‌-8లో 2,549 మంది వీధి వ్యాపారులు ఉన్నారు. <<17922542>>వెండింగ్‌ జోన్ల<<>>ను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు.

News October 6, 2025

5గంటల ఆలస్యంగా తిరుపతి-హౌరా ఎక్సప్రెస్

image

ఆదివారం సాయంత్రం 4 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరాల్సిన తిరుపతి-హౌరా ఎక్సప్రెస్(20890) 5 గంటల లేటులో నడుస్తోంది. రాత్రి 9 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరిందని రైల్వే అధికారులు తెలిపారు. సమాచారం తెలియన కొంతమంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రిజర్వేషన్ చేసుకున్న వారు వేరే మార్గం లేక వేచి ఉండాల్సి వచ్చింది.

News October 5, 2025

విశాఖ చేరుకున్న కేంద్ర మంత్రి

image

విశాఖ విమానాశ్రయానికి కేంద్రమంత్రి జలరవాణా శాఖ మంత్రి సర్బానంద్ సోనావాల్ ఆదివారం రాత్రి చేరుకున్నారు. సోమవారం విశాఖ పోర్టులో భారీ క్యారియర్ నౌక చేరుకుంటున్న నేపథ్యంలో మంత్రి స్వాగతం పలకనున్నారు. సాగర్‌మాల ప్రాజెక్టుకు సంబంధించి ఇతర అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయనున్నారు. మంత్రికి స్వాగతం పలికిన వారిలో పోర్టు కార్యదర్శి వేణుగోపాల్ ఇతర అధికారులు ఉన్నారు.