News October 5, 2025

నేను MLA పదవికి రాజీనామా చేయడం లేదు: దానం

image

తాను రాజీనామా చేస్తున్నట్లు వస్తోన్న వార్తలపై ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ స్పందించారు. కావాలనే కొందరు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. గిట్టని వాళ్లు చేస్తున్న పని ఇది అంటూ దానం స్పష్టం చేశారు. MLA పదవికి రాజీనామా చేయనని చెప్పుకొచ్చారు.

Similar News

News October 5, 2025

నాంపల్లి: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సమీక్ష

image

ప్రజాభవన్‌లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏఐసీసీ ఇన్‌ఛార్జీ మీనాక్షి నటరాజన్ హాజరై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ ఉపఎన్నికను టీపీసీసీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందన్నారు. ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై ఆమె సూచనలు చేశారు.

News October 5, 2025

తారాస్థాయికి జూబ్లీ ఫైట్

image

జూబ్లీహిల్స్‌లో ప్రచార పర్వం తారా స్థాయికి చేరింది. అభ్యర్థిని ప్రకటించిన BRS గ్రౌండ్‌ వర్క్ మొదలుపెట్టింది. ఇక అధికార పార్టీ ఓ వైపు అభ్యర్థిని ఫైనల్ చేస్తూనే సెగ్మెంట్‌ అభివృద్ధిపై‌ ఫుల్ ఫోకస్ చేసింది. డివిజన్లలో రూ.కోట్లు పెట్టి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తోంది. BJP కూడా ఎక్కడా తగ్గడం లేదు. గెలుపు ధీమాతో ఉంది. ఇక బైపోల్‌లో దేఖ్‌లేంగే అంటూ లోకల్ నాయకులు సవాళ్లు విసురుతున్నారు.

News October 5, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: INCలో ఆ నలుగురి పేర్లు

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిపై కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్ తయారు చేసింది. ఆశావహులందరి పేర్లు పరిశీలించిన ప్రభుత్వం షార్ట్‌లిస్టు రెడీ చేసింది. ఇందులో నవీన్ యాదవ్, సీఎన్‌రెడ్డి, బొంతురామ్మోహన్, అంజన్‌కుమార్ పేర్లు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ లిస్టును అధిష్ఠానానికి పంపితే AICC అభ్యర్థిని ఫైనల్ చేయనుంది. BJP అభ్యర్థిని ఫైనల్ చేసేందుకు స్టేట్ చీఫ్ రాంచందర్ రావు ముగ్గురికి బాధ్యతలు అప్పగించారు.