News October 5, 2025
కామారెడ్డి: సీఎం కాదు.. కటింగ్ మాస్టర్: హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వంపై MLA హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డిది కేవలం ‘దోచుకునే ప్రభుత్వం’ అని విమర్శించారు. ఆయనను ‘చీఫ్ మినిస్టర్ కాదు, కటింగ్ మాస్టర్’ అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ తెచ్చిన పథకాలను కటింగ్ పెడుతూ, ఆయన కట్టిన బిల్డింగ్‌లకు రిబ్బన్లు కత్తిరిస్తున్నారని ఆరోపించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్యాకేజీ హామీలు గాలికి పోయాయని విమర్శించారు.
Similar News
News March 6, 2026
ఆసిఫాబాద్: ఏప్రిల్‌లోనే మూడు నెలల రేషన్

వేసవి ఎండల దృష్ట్యా రేషన్ లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఏప్రిల్‌లోనే ఒకేసారి పంపిణీ చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. జిల్లాలోని 315 దుకాణాల ద్వారా 1,63,765 కార్డుదారులకు మొత్తం 10,559.229 మెట్రిక్ టన్నుల బియ్యం అందజేయనున్నారు. ఎండల తీవ్రత పెరగకముందే కోటా పంపిణీ పూర్తి చేయాలని అధికారులు యోచిస్తున్నారు.
News March 6, 2026
ఇక మారవా బ్రో..!

నిన్న టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో ఇంగ్లండ్‌పై భారత్ గెలిచినా ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. 9 పరుగుల వద్ద మరోసారి చెత్త షాట్‌తో వికెట్ పారేసుకున్నారు. దీంతో ఈ టోర్నీలో పేలవ ప్రదర్శన కంటిన్యూ చేస్తున్నారు. మాజీలు సైతం నిలకడగా ఆడాలని చెబుతున్నా అభి ఆటతీరు మారడం లేదు. ఇక టోర్నీలో మిగిలింది ఫైనల్ మాత్రమే. మరి అందులోనైనా రాణించి భారత్‌కు కప్పు అందిస్తారో లేదో చూడాలి.
News March 6, 2026
MDK: మోడల్ స్కూల్ ప్రవేశాలు..ఈనెల 10 వరకే ఛాన్స్

రాష్ట్రవ్యాప్తంగా 194 మోడల్ స్కూళ్లలో 2026-27 ఏడాదిలో 6 నుంచి 10వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 10వ తేదీ వరకు గడువు ఉంది. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధనతోపాటు ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్, టీపీటీ, సీఎస్ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు. ఆసక్తిగల విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.


